
‘కష్టపడకుండా ఏది రాదని, తనయుడు రామ్చరణ్ ఈ మూవీ కోసం కష్టపడి మీ అందరితో ‘పెద్ది’ అనిపించుకుంటున్నాడని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
తామంతా కష్టాన్నే నమ్ముకున్నామని, షార్ట్కట్ గురించి ఆలోచించమన్నారు. రామ్చరణ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘పెద్ది మెగా బ్లాక్బస్టర్’ ఈవెంట్లో చిరంజీవి పాల్గొని మాట్లాడారు. ‘పెద్ది’లో చరణ్ నటన చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇక నుంచి చరణ్జీవిగా అనిపించుకుంటాడని, న్యూ ఏజ్ మెగాస్టార్గా నిలుస్తాడని అన్నారు. ఈ వార్త చదివారా: తండ్రైన నటుడు నారా రోహిత్