
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చాలా యుద్దాల్లో జోక్యం చేసుకున్నారు, అలాగే పలు యుద్దాల్లో నేరుగా తమ దళాల్ని రంగంలోకి దింపారు.
అలాగే రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగిన యుద్దంలోనూ ఎంటర్ అయ్యారు. ఉక్రెయిన్ కు మద్దతునిస్తూ రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో ఉక్రెయిన్ కు శాంతి దళాల పేరుతో యూరప్ కాకుండా ఇతర దేశాల బలగాలను పంపేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భారత్ ప్రస్తావన కూడా వచ్చింది. తన డిప్యూటీ జేడీ వాన్స్ తో ట్రంప్ జరిపిన చర్చలో వచ్చిన ఈ ప్రస్తావనను ఓ పుస్తకం బయటపెట్టింది.ఇరాన్ చమురుకు డాలర్ పిలుపు..! ప్రపంచ ఆర్ధిక చిత్రం మార్చే పరిణామం..! భారత్ కూ మేలు..!మ్యాగీ హేబర్‌మన్, జొనాథన్ స్వాన్ రచించిన రెజీమ్ చేంజ్ అనే పుస్తకం నిన్న విడుదలైంది. ఇందులో ఉక్రెయిన్ యుద్ధం పట్ల డొనాల్డ్ ట్రంప్ రెండవ ప్రభుత్వం అనుసరించిన విధానంపై తెరవెనుక తలెత్తిన విభేదాలను వివరించారు. ముఖ్యంగా భారత్ కు కీలక మిత్రదేశమైన రష్యాతో ముడిపడి ఉన్న ఈ సంఘర్షణలో శాంతి పరిరక్షకులుగా భారత లేదా సౌదీ అరేబియా దళాలను మోహరించవచ్చా అని అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ట్రంప్-జేడీ వాన్స్ (trump- jd vance) చర్చించుకున్నారు. ట్రంప్ పవర్స్ కట్, యుద్ధం చేసే అధికారం ఇక లేదా?ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల తర్వాత, అంటే గతేడాది జనవరి 30న ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఒక సమావేశంలో ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ మిషన్ కోసం ఐరోపా యేతర దళాన్ని పంపే అవకాశాన్ని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్షుడు ట్రంప్ తో ప్రస్తావించారు. అయితే భారత్ ను పంపాలనే ఆలోచనను ట్రంప్ వెంటనే తిరస్కరించారని, నవ్వుతూ, భారతీయులు దేనికీ ఎప్పుడూ డబ్బు చెల్లించరు, ఉక్రెయిన్ లోనూ వాళ్లు ఖర్చు చేయరు అంటూ బదులిచ్చినట్లు ఈ పుస్తకంలో రాశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి కమాండర్ ఉద్దేశాన్ని వివరించడానికి, ట్రంప్ ఉక్రెయిన్-రష్యా కోసం ప్రత్యేక అధ్యక్ష రాయబారిగా నియమించిన రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లాగ్ నిర్వహించిన సమావేశంలో ఈ సంభాషణ జరిగింది.