
టీటీడీ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై సమయాన్ని తప్పుగా ముద్రించడంతో సుమారు 300 మంది
భక్తులు గందరగోళానికి గురయ్యారు. అయితే, టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, వారికి ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఊరట చెందారు.వివరాల్లోకి వెళితే.. నిన్న శ్రీవారి దర్శనం కోసం పలువురు భక్తులు మూడు నెలల ముందే ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కొనుగోలు చేశారు. ఈ టికెట్లపై దర్శన సమయం సాయంత్రం 4 గంటలకు బదులుగా, పొరపాటున ఉదయం 4 గంటలుగా ముద్రితమైంది. టికెట్‌పై ఉన్న సమయాన్నే ప్రామాణికంగా తీసుకున్న దాదాపు 300 మంది భక్తులు, తెల్లవారుజామున 3 గంటలకే తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు చేరుకున్నారు.దర్శనం కోసం క్యూలో నిల్చున్న భక్తుల టికెట్లను అక్కడి టీటీడీ సిబ్బంది తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. సాయంత్రం జరగాల్సిన దర్శనానికి ఉదయం సమయం వేశారని గుర్తించారు. దీంతో ఏం చేయాలో తెలియక భక్తులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. శ్రీవాణి ట్రస్ట్ దాతల విభాగం సిబ్బంది చేసిన పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ పొరపాటును ముందే గమనించి సుమారు 200 మంది భక్తులకు సరైన సమయాన్ని తెలియజేశామని, కానీ మిగిలిన 300 మందికి సమాచారం అందకపోవడంతో ఇబ్బంది పడ్డారని