
డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డేను నిర్వహిస్తున్నామని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నశాముక్త భారత్ కింద మళ్లీ ఈ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు.
సిద్దిపేట, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డేను నిర్వహిస్తున్నామని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) వ్యాఖ్యానించారు. నశాముక్త భారత్ కింద మళ్లీ ఈ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) సిద్దిపేట పట్టణంలో డిగ్రీ కళాశాల మైదానంలో ఒలింపిక్ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ రన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఒలింపిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలను ఎండలో ఉంచడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. డీ విటమిన్ కోసం ఒక ట్యాబ్లెట్ వేస్తున్నారు కానీ ఎండలో మాత్రం ఉంచట్లేదని తెలిపారు. యోగాతో ఆరోగ్యంగా ఉంటారని వివరించారు.
యోగా చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించారు. ఒలింపిక్స్ క్రీడలను తాము చిన్నపుడు చూసేదని.. ఇండియాకి ఎన్ని కప్పులు వచ్చాయో అని తెలుసుకునే వాళ్లమని అన్నారు. ఎప్పుడు కూడా చైనా ఒలింపిక్స్‌లో మొదటగా వచ్చేదని.. మనం మాత్రం కింది స్థానంలో ఉండే వాళ్లమని వెల్లడించారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలకు క్రీడలు అలవాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా మన దేశానికి కావాల్సింది భగవద్గీత పుస్తకాలు కాదని.. క్రీడా మైదానాలు కావాలని అన్నారు. మన దేశంలో ఉన్నా క్రీడాకారులను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉండటం చాలా అదృష్టమని.. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.
అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్
పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News