శ్రీవల్లి కడుపు బాగోతాన్ని బయటపెట్టడంలో భాగంగా.. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టింది నర్మద. మొదటిగా ఆ మెషీన్ పనిచేస్తుందో లేదో వేదవతికి పెట్టి టెస్ట్ చేసింది నర్మద.
ఇక ఈరోజు (జూన్ 24) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నీ కడుపులో బిడ్డ ఉందా లేదా? అని సూటిగా అడుగుతుంది నర్మద. ఉందీ అని అంతే సూటిగా సమాధానం ఇస్తుంది శ్రీవల్లి. అయితే మెషీన్ రాంగ్ అని అరవడంతో.. అంతా షాక్ అవుతారు. అంటే ఏమంటున్నావ్.. నీ కడుపులో బిడ్డ లేదా? అని అడుగుతుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి.. ‘అవును లేదూ’ అని నోరు జారేసి నిజం చెప్పేస్తుంది. అప్పుడు మెషీన్.. ఆల్ రైట్ అని అంటుంది. దీంతో వాళ్లంతా డబుల్ షాక్ అవుతారు. ‘ఏంటే.. నీ కొడుపులో నిజంగా బిడ్డ లేదా? అని వేదవతి అడుగుతుంది. ‘ఉన్నాడు ఉన్నాడు’ అని అంటుంది. అప్పుడు మెషీన్ మళ్లీ అరవడంతో.. ఇది డబ్బా మెషీన్ అని అంటుంది శ్రీవల్లి. చేతికి పెట్టిన వైర్లను పీకేసిన శ్రీవల్లి.. వందో రెండొందలో పెట్టి ఆన్ లైన్లో కొన్న ఈ డబ్బా మెషీన్ నిజాలను అబద్దాలను చెప్పేస్తుందా? అలా అయితే.. కడుపులో బిడ్డ ఉందని కనిపెట్టడానికి హాస్పిటల్స్ ఎందుకు? ఆ టెస్ట్‌లు ఎందుకు?హాస్పిటల్స్ ఎందుకూ.. కోర్టులు ఎందుకు?? అందరూ ఈ డబ్బా మెషీన్ కొనుక్కునే వారు కదా..? నిజాన్ని చెప్పించే మెషీనే అయితే.. మరి కోర్టులు ఎందుకు? తీర్పులు ఎందుకు? చూడండి అత్తయ్యా.. మీరు వీళ్ల మాట విని నన్ను నా కడుపుని అవమానించారు? నేను అలిగాను అంటూ అక్కడ నుంచి జారుకుంటుంది శ్రీవల్లి. ఏయ్ ఏంటే ఇదీ అని అంటుంది వేదవతి. కాస్త వెయిట్ చేయండి అత్తయ్యా.. ఈ గందరగోళంపై క్లారిటీ వచ్చేస్తుంది అని అంటుంది నర్మద. అటు శ్రీవల్లి.. ‘ఒసేయ్ సుక్కూ.. ఆ నర్మద, ప్రేమలకి నా కడుపుపై లైట్‌గా డౌట్ కొట్టేసిందా ఏంటీ? అని అడుగుతుంది. లైట్‌గా ఏంటీ.. ఫుల్‌గా కొట్టేసింది.. అందుకే కదా నీతో కచేరీలు చేయిస్తున్నారూ అని అంటుంది. ఓం.. బీం.. బుష్ బాబా.. మళ్లీ కొత్త స్కామ్ అయితే వాళ్లు నన్ను వదిలిపెట్టరు.. కోడిపిల్ల కోసం గద్ద తిరిగినట్టు వాళ్లు నా చుట్టూ తిరిగేస్తారు అని అంటుంది శ్రీవల్లి. మాటల్లో నర్మద, ప్రేమ, ధీరజ్‌లు ఎంట్రీ ఇస్తారు. నుదుటన బొట్టు పెట్టుకుని భక్తి పాటలు పాడుకుంటూ వస్తారు. ఏంటీ తీర్థయాత్రలకు కానీ పోతున్నారా.. భక్తి రసం పొంగుతోంది అని అంటుంది శ్రీవల్లి. ‘నిన్నూ మీ పుట్టింటి యాత్రకి పంపిస్తున్నాం’ అని అంటుంది ప్రేమ. ఇంతలో నర్మద ఓ తాయత్తు తీసి.. మన ఊరికి ఓంబీం బుస్ బాబా వచ్చారు. ఈ తాయత్తు కట్టుకుంటే.. మన మీద ఎలాంటి చీడా పీడలు ఉండవు. నీకు నీ కడుపులో బిడ్డకి ఎలాంటి నరదిష్టి తగలకూడదని ఈ తాయత్తు తెచ్చాం అని అంటారు నర్మద, ప్రేమలు. కట్టేసింద్రోయ్.. చుట్టేసింది ఇదిగో వల్లీ.. వీళ్లు తాయత్తు పేరుతో మళ్లీ కొత్త స్కామ్ వేశారు.. కాస్త జాగ్రత్త అని చెవిలో ఊదుతుంది సుకన్య. దాంతో శ్రీవల్లి.. ‘నాకేం వద్దు.. ఇలాంటి వాటిని నేను నమ్మను అని అంటుంది. ఇంతలో చందు వచ్చి.. ‘బుద్దిలేకుండా మాట్లాడకు.. నీతో పాటు కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని క్షేమంగా ఉండాలని తాయత్తు తెస్తే వద్దంటావా? వాళ్లు తెచ్చింది నీ మంచి కోసమే కదా.. నర్మదా నువ్వు కట్టు అని అంటాడు చందు. దాంతో నర్మద.. తాయత్తు కట్టేస్తుంది. అనంతరం ధీరజ్.. ‘ఈ తాయత్తు కట్టుకున్నాక కొన్ని కండిషన్స్ ఉన్నాయ్ వదినాయ్.. ఇది కట్టుకున్నప్పటి నుంచి తెల్లారే లోపు ఏదైనా జరగొచ్చు’ అని అంటాడు. ఆ తాయత్తు తీశావో.. చచ్చావే.. ఏదైనా అంటే అని నోరెళ్ల బెడుతుంది శ్రీవల్లి. ‘అబద్దాలు చెప్పే వాళ్లూ.. మోసం చేసేవాళ్లూ.. రక్తం కక్కుని చచ్చిపోతారట.. రాత్రి నిద్రపోయినా.. తాయత్తుని తీసేసినా నిద్రలోనే పోతారు’ అని అంటారు నర్మద, ప్రేమలు. దాంతో శ్రీవల్లి.. చచ్చానురా దేవుడా అని అనుకుంటుంది. ఇక రాత్రి మొత్తం శ్రీవల్లికి జాగారమే. కంటిమీద కునుకు లేకుండా తాయత్తుని చూసుకుంటూ ఉంటుంది. పడుకుంటే రక్తం కక్కుకుని చచ్చిపోతానే.. అని సుకన్య దగ్గర తెగ ఫీల్ అయిపోతుంది శ్రీవల్లి. వాళ్లు కావాలనే ఇదంతా చేస్తున్నారే తింగరి.. నీతో ఆడుకుంటున్నారు.. నిన్ను ఎర్రిగొర్రెని చేస్తున్నారే తింగరిదానా? అని అంటుంది సుకన్య.అది రక్తమేనా?.. అంటే చచ్చిపోతానా?? సరే అయితే పడుకుంటా అని శ్రీవల్లి వెళ్తూ వెళ్తూ నీళ్లు తాగుతుంది. అయితే ఆ నీట్లో అప్పటికే నర్మద ఎర్రరంగు కలిపేస్తుంది. చూసుకోకుండా తాగేసిన శ్రీవల్లి.. ఈ నీళ్లు ఏంటి తేడాగా ఉన్నాయ్ అంటూ తాగేస్తుంది. సింక్‌లో ఊసేసరికి.. ఎర్రగా కనిపిస్తాయి. దాంతో నిజంగానే రక్తం కక్కుకుంటున్నా.. ఇదంతా తాయత్తు మహిమే.. అంటే నేను రక్తం కక్కుకుని చచ్చిపోతానా? అని భయపడి చస్తుంది. గదిలోకి వెళ్లి.. శ్రీవల్లి పడుకోదు.. సుకన్యని కూడా పడుకోనీయదు. తెల్రార్లూ జాగారం చేసేస్తుంది శ్రీవల్లి. ఇక ఉదయాన్నే వచ్చి.. చెడుగుడు ఆడుకుంటారు ధీరజ్, నర్మద, ప్రేమలు. అంటే మీరు అబద్దం చెప్పారా.. అబద్దాలు, మోసాలు చేస్తే కదా రక్తం కక్కుకుని చచ్చిపోతారని చెప్పిందీ.. మరి నువ్వెందుక పడుకోలేదు అని అడుగుతారు. అబ్బే నేను ఫుల్‌గా పడుకున్నా.. అని అని కవర్ చేసేస్తుంది శ్రీవల్లి. ‘అయినా నాకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు.. నేను నిద్రపోతే రక్తం కక్కుకుని చచ్చిపోతానని మీరు నాకు అబద్దం చెప్పారు కదా.. అని నోరెళ్లబెడుతుంది శ్రీవల్లి. నీకు ముందే చెప్పాను కదే తింగరి సచ్చినదానా? నా మాట వినకుండా నువ్వు జాగారం చేసి.. నాతో కూడా జాగారం చేయించావ్.. అని అంటుంది సుకన్య. సర్ సర్లే కానీ.. నీకు జ్వరంగా ఉన్నట్టు ఉంది.. హాస్పిటల్‌కి వెళ్దాం పదా అని కొత్తనాటకానికి తెరతీస్తారు నర్మద, ప్రేమలు. పదవే హాస్పిటల్‌కి.. నాకేం జ్వరం లేదు.. అని శ్రీవల్లి అంటే.. కడుపుతో ఉన్న వాళ్లకి జ్వరం రాకూడదు.. అర్జెంట్‌గా హాస్పిటల్‌కి పదా అంటూ శ్రీవల్లిని బలవంతంగా తీసుకుని వెళ్తుంటారు నర్మద, ప్రేమలు. ఇంతలో వేదవతి ఎదురై ఎక్కడికే అని అడుగుతుంది. చూడండి అత్తయ్యా.. నేను రానంటుంటే బలవంతంగా తీసుకుని వెళ్తున్నారూ అని అంటుంది శ్రీవల్లి. పాపం వదిలేయండే రానంటుంది కదా.. అని వేదవతి అంటే.. ‘కడుపుతో ఉన్న వాళ్లకి జ్వరం రాకూడదు.. కడుపులో బిడ్డకి ఏమైనా కావచ్చు’ అని అంటుంది నర్మద. దాంతో.. ‘నిజమే కదా.. బిడ్డకి ఏమైనా అవుతుంది వెళ్లవే’ అని అంటుంది వేదవతి. ‘అయ్యో అత్తా.. నాకేం పర్లేదు.. అయినా వెళ్లాల్సి వస్తే మా అమ్మ వచ్చి తీసుకుని వెళ్తుంది’ అని అంటుంది శ్రీవల్లి. అయితే నర్మద మాత్రం.. వినకుండా శ్రీవల్లి బాగోతాన్ని బయటపెట్టడానికి లాక్కుని వెళ్తుంది నర్మద.