డబ్బులు చేతికి వచ్చాక ఇందు మారిపోతే ఏం చేస్తారు అని శేషు, భూషణ్ అడుగుతారు. మారింది సీఈవోనే.. కానీ కంపెనీలో, ఇంట్లో నా మాటను దాటే వారు లేరు.. ఆ సాహసం ఎవ్వరూ చేయరు అని రేఖ అంటుంది.
ఇదే కాన్ఫిడెన్స్‌తో వెళ్లండి.. ఆఫీసు నుంచి ఎలాంటి మొహాలతో వస్తారో చూసుకోండి అని శేషు తనలో తాను అనుకుంటాడు. ఇంకో వైపు బొకే ఆర్డర్ కోసం నందు వెళ్తుంటే స్కూటీ పంక్చర్ అవుతుంది. వెంకీకి ఫోన్ చేసి సాయం అడుగుతుంది. డెలివరీలు ఉన్నాయి.. రావడం కష్టం అని వెంకీ అంటాడు. నీకోసం నేను ఎన్ని సార్లు సాయం చేయలేదు..నువ్వు మాత్రం నా కోసం రమ్మంటే రావడం లేదు.. ఉద్యోగం వచ్చాక మారిపోయావ్.. స్వార్థ పరుడివి అయ్యావ్ అని నందు అంటుంది. అంత పెద్ద మాటలు ఎందుకు లే.. వస్తాను ఆగు అని వెంకీ అంటాడు. ముందు నా డెలివరీ.. తరువాతే నీ బొకే డెలివరీ అని వెంకీ అంటాడు. సరే నీ ఇష్టం.. ముందు నా డెలివరీ అనేంత స్వార్థపరురాలిని కాదు లే అని నందు అంటుంది. సరే పదా అని వెంకీ, నందు బయల్దేరుతారు.పెద్ద డీల్ ఇచ్చిన హర్ష.. ఇందు మొదటి డీల్ గురించి హర్ష చెబుతాడు. మేం వంద దేవాలయాల్ని పునరుద్దించే కాంట్రాక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రతీ దేవాలయంలో విగ్రహాలకు ట్రెడిషనల్ నగల్ని చేయించాలని చూస్తున్నాం. మీరు ముందుగా ఈ శాంపిల్‌ను కరెక్ట్ చేసి ఇస్తే.. ఆ వంద టెంపుల్స్ కాంట్రాక్ట్ మీకే ఇస్తామని హర్ష అంటాడు. అంత పెద్ద డీల్ ఆ? అని రాజు షాక్ అవుతాడు. ఈ హర్ష గాడికి మంచి నెట్ వర్క్ ఉందేమో అని రేఖ, భూషణ్ అనుకుంటాడు. మేం చేసి పెడతాం అని రాజు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తాడు.పెనాల్టీ వేస్తాం.. ఈ డాకుమెంట్లు చదువుకోండని ఇందుకి హర్ష ఇస్తాడు. ఆ డాకుమెంట్లను ఇందు చెక్ చేస్తోంది. చదువుతున్నట్టుగా నటిస్తోందని రేఖ, భూషణ్ అనుకుంటారు. అది విని రాజు నవ్వుకుంటాడు. మీకు ఇంకో షాక్ తగులుతుంది అని రాజు తనలో తాను అనుకుంటాడు. లేట్ అయితే మాత్రం పెనాల్టీ వేస్తాను.. అది నా రూల్ అని హర్ష చెబుతాడు. సరేనండి.. మీ రూల్స్ నేను పాటిస్తాను.. మీకు చెప్పిన టైంకి డిజైన్స్ చేసి చూపిస్తాను.. ఎలాంటి ఆలస్యం కానివ్వను.. అని ఇందు మాటిస్తుంది. మేం మాటిస్తే తప్పం అని రాజు కూడా మాట కలిపేస్తాడు.సంతకం పెట్టిన ఇందు.. అన్నీ సరిగ్గా మళ్లీ ఒకసారి చదువుకుని సంతకం పెట్టండని హర్ష అంటాడు. దీంతో ఇందు చకచకా సంతకం పెట్టేస్తుంది. అది చూసి రేఖ, భూషణ్ షాక్ అవుతారు. దీనికి సంతకం పెట్టడం వచ్చా? ఇంత వరకు వేలి ముద్రే వేసింది కదా అని ఆశ్చర్యపోతారు. వారిని చూసి రాజు నవ్వుకుంటాడు. ఇందు గురించి అన్నీ తెలిస్తే రేఖ పిన్ని గుండె పగిలి చస్తుందేమో అని అనుకుంటాడు. సరే ఈ విషయాలన్నీ ఇంటికి వెళ్లాక అడుగుదాం.. ముందు డబ్బులు మన చేతికి రానివ్వు అని రేఖ అంటుంది.రాజు, రేఖలకు ఇందు కౌంటర్.. యాభై లక్షల అడ్వాన్స్ హర్ష ఇవ్వడంతో రాజు, రేఖ బెల్లం చుట్టూ ఈగల్లా వాలుతారు. డబ్బు నాకంటే నాకు అని గొడవ పడుతుంటారు. ఇందు మాత్రం ఎంప్లాయిస్‌కి శాలరీ ఇవ్వాలని ఆ డబ్బుని తీసుకు వెళ్తుంది. దీంతో రాజు, రేఖ షాక్ అవుతారు. ఏంటి పిన్ని.. మనమే కంత్రిగాళ్లం అనుకుంటే.. మనకంటే కంత్రిలా తయారైందని రాజు కౌంటర్ వేస్తాడు. ఏం జరగుతుందో చూద్దాం పదా.. నేను అనుకున్నట్టుగానే జరిగింది.. డబ్బు రాగానే ఇందు మారిపోయింది.. నీ చేతికి డబ్బు ఇవ్వలేదు చూశావా? అని రేఖని తిడతాడు భూషణ్.చెడామడా తిట్టిన నందు.. ఇంకో వెంకీ ఒకప్పుడు ప్రేమించిన ప్రేమికురాలు కనిపిస్తుంది. డెలివరీ బాయ్‌గా చేస్తున్నావా? ఇదే నీ రేంజ్.. ఇది నా రేంజ్ అని తన కొత్త ప్రియుడ్ని, కారుని చూపిస్తుంది. పూటకో డ్రెస్ మార్చినట్టుగా బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చే నువ్వు వెంకీ గురించి మాట్లాడుతున్నావా.. అలాంటి వాడు దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.. వాడి కాలి గోటికి కూడా నువ్వు పనికి రావు.. కష్టపడి ఫ్యామిలీని పోషించే వాడు ఎక్కడా.. జల్సాల కోసం తిరిగే నువ్వు ఎక్కడా అని వెంకీని ఆకాశమంత ఎత్తులో నిలబెడుతుంది నందు.ఉద్యోగులకు జీతాలు.. ఇందు ఇప్పుడు ఎంప్లాయిస్‌కి శాలరీ ఇస్తే నెత్తిన పెట్టుకుని చూస్తారని భూషణ్ అంటాడు. ఇక అందరికీ శాలరీలు ఇస్తుంది ఇందు. అందరికీ వచ్చాయా? ఎవ్వరికీ మిస్ కాలేదు కదా? ఇకపై ఎవ్వరికీ ఆలస్యం అవ్వదు.. ప్రతీ నెలా శాలరీ వస్తుంది అని ఇందు చెబుతుంది.దీంతో ఉద్యోగులు సంబరపడతారు. రేఖ మాత్రం షాక్ అవుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసిన బాలు, మీనా.. కార్లు కడిగే పనిలో పెడతా.. ప్రభావతికి సత్యం కౌంటర్లు