జీడిపప్పు, బాస్మతి బియ్యం, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, రోజ్ వాటర్, ఉప్పు తగినంత, నూనె, నెయ్యి ముందుగా మందపాటి...
జీడిపప్పు, బాస్మతి బియ్యం, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, రోజ్ వాటర్, ఉప్పు తగినంత, నూనె, నెయ్యి
ముందుగా మందపాటి కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా నూనె, నెయ్యి వేసి బాగా వేడి చేసుకోండి.
నూనె వేడి అయ్యాక లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకులు, షాజీరా వేసి బాగా వేయించుకోండి.
అవన్నీ వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి రంగు మారాక జీడిపప్పు కూడా వేసి బాగా వేయించుకోండి.
తర్వాత పచ్చిమిర్చి, పుదీనాతో పాటు కొత్తిమీర వేసి తర్వాత తగినంత ఉప్పు, పసుపు కూడా వేసి కాసేపు కలుపుకోండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోండి.
ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసి తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి ఒకట్రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి.
తర్వాత మూత తీసి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కాసేపు అలాగే ఉంచండి.
అంతే.. రుచికరమైన కాజు పులావ్ రెడీ అయినట్లే. వేడి వేడిగా రైతా లేదా సలాన్తో రుచి అదిరిపోతుంది.