
Special Train From Jodhpur To Chennai Beach: భారతీయ రైల్వే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
జోధ్‌పూర్ నుంచి చెన్నై బీచ్ వరకు స్పెషల్ ట్రైన్లు నడపాలని ఫిక్స్ అయ్యారు. ఇవి జూన్, జూలై రెండు నెలల పాటు అందుబాటులో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రైలు ఆగే స్టేషన్లు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం.
ప్రయాణికులకు ప్రయాణం సులభంగా ఉండాలని భారతీయ రైల్వే ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే రద్దీ ఎక్కువగా ఉండే చోట స్పెషల్ ట్రైన్లు నడుపుతూ, అవసరమైతే వాటిని రెగ్యులర్ రైళ్లుగా కూడా మారుస్తుంటారు. ఈ క్రమంలోనే జూన్, జూలై రెండు నెలల పాటు జోధాపూర్ నుంచి చెన్నై బీచ్ కి స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. దీని హాల్ట్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ప్రతి శనివారం జోధ్‌పూర్ నుంచి చెన్నై బీచ్ కి ఈ రైలు (ట్రైన్ నెంబర్ 04815) నడుస్తుంది. అంటే జూన్ 27, జూలై 4, 11, 18, 25 తేదీల్లో ఈ సర్వీస్ ఉంటుంది.
అలాగే, ఎంజీఆర్ చెన్నై నుంచి జోధ్‌పూర్ కి వెళ్లే ఈ రైలు (ట్రైన్ నెంబర్ 04816) అన్ని మంగళవారాలు అందుబాటులో ఉంటుంది. అంటే జూన్ 30, జూలై 7, 14, 21, 28 తేదీల్లో ఈ ట్రైన్ ప్రయాణం చేస్తుంది.
మొదట జోధ్‌పూర్ నుంచి బయలుదేరే ఈ రైలు నాగపూర్, బాలార్షా, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట మీదుగా చెన్నై ఎంజీఆర్ సెంట్రల్ నుంచి చెన్నై బీచ్ వరకు వెళ్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ హాల్ట్ స్టేషన్లు ఉండటం వల్ల, ఈ రూట్లో ప్రయాణించే వారు చాలా ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. జూన్, జూలై రెండు నెలల పాటు మాత్రమే ఈ సేవలు ఉంటాయి. చెన్నై వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట.