
అమెరికా కార్పొరేట్ ప్రపంచంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి సంచలనం సృష్టించారు. అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ 'వెల్‌టవర్' సీఈఓగా పనిచేస్తున్న శంఖ్ మిత్రా, ప్రపంచంలోనే అత్యధిక...
అమెరికా కార్పొరేట్ ప్రపంచంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి సంచలనం సృష్టించారు. అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ 'వెల్‌టవర్' సీఈఓగా పనిచేస్తున్న శంఖ్ మిత్రా, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఏకంగా 821 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,789 కోట్లు) విలువైన వేతన ప్యాకేజీని అందుకుని చరిత్ర సృష్టించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (158.4 బిలియన్ డాలర్లు) తర్వాత అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా శంఖ్ మిత్రా రికార్డులకెక్కారు.ప్యాకేజీలో 99 శాతం స్టాక్ గ్రాంట్లేప్రముఖ పత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం ప్రకారం శంఖ్ మిత్రా ప్యాకేజీలో 99 శాతం స్టాక్ గ్రాంట్ల రూపంలోనే ఉంది. అక్టోబర్‌లో ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ కేటాయించారు. అయితే, ఈ ప్యాకేజీకి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. కంపెనీలో ఆయన 2031 వరకు కొనసాగితేనే సగం షేర్లను పొందుతారు. మిగిలిన సగం పొందాలంటే, ఐదేళ్ల వ్యవధిలో వెల్‌టవర్ మార్కెట్ విలువ 45 శాతం పెరగాలి. అంతేకాకుండా పలు స్టాక్ ఇండెక్స్‌ల కంటే కంపెనీ షేర్ల పనితీరు మెరుగ్గా ఉండాలి. ఆయన నాయకత్వంలో కంపెనీ వృద్ధి సాధిస్తేనే ఈ భారీ మొత్తం ఆయనకు దక్కుతుంది. ఇది ఆయన గత ప్యాకేజీ కంటే 40 శాతం అధికం కావడం గమనార్హం.భారత్‌లో చదువుకుని.. అమెరికాలో అద్భుతాలుభారత్లోనే పుట్టి పెరిగిన శంఖ్ మిత్రా, జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి