
టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్ వేరబుల్స్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది.
గూగుల్, స్నాప్ వంటి ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ 299 డాలర్ల (సుమారు రూ. 25,000) ప్రారంభ ధరతో సొంత బ్రాండ్‌పై ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎస్సిలార్ లూక్సోటికా భాగస్వామ్యంతో జూన్ 23న ఈ సరికొత్త మెటా గ్లాసెస్‌ను కంపెనీ ప్రకటించింది.గతంలో రేబాన్, ఓక్లీ వంటి లగ్జరీ బ్రాండ్లతో కలిసి పనిచేసిన మెటా.. ఈసారి ప్రీమియం డిజైనర్ బ్రాండింగ్ లేకుండానే తక్కువ ధరకే వీటిని అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేబాన్ మెటా మోడల్స్ (379 డాలర్లు) ధర కంటే ఇవి దాదాపు 80 డాలర్లు తక్కువ కావడం గమనార్హం.ఈ కొత్త లైనప్‌లో విభిన్న శైలి, రంగులతో పాటు ప్రధానంగా మూడు రకాల ఫ్రేమ్ ఆప్షన్లను మెటా పరిచయం చేసింది. బేస్ మోడల్స్ అయిన 'అడ్వెంచరర్', 'ఫ్యూరీ' వేరియంట్లు 299 డాలర్ల ధరకే లభిస్తుండగా, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కైలీ జెన్నర్‌తో కలిసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రీమియం మోడల్ 'స్టార్‌ఫైర్' ధరను 399 డాలర్లుగా నిర్ణయించారు.ఈ స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్ల విషయానికొస్తేకెమెరా, ఆడియో: 12-మెగాపిక్సెల్ కెమెరా, ఓపెన్-ఈర్ స్పీకర్లు.మెటా ఏఐ: చేతులతో పనిలేకుండా వాయిస్ కమాండ్స్ ద్వారా ప్రశ్నలు అడిగే సదుపాయం.లైవ్ స్ట్రీమింగ్: ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్‌కు నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే వీలు.బ్యాటరీ బ్యాకప్: ఎనిమిది గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్. అలాగే ఇవి ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లకు