
వర్షాకాలంలో కారు విండ్షీల్డ్పై ఫాగ్ ఏర్పడి బయట కనిపించకపోవడం వాహనదారులకు సాధారణంగా ఎదురయ్యే సమస్య. అయితే ఏసీ, హీటర్‌ను సరైన విధంగా ఉపయోగించడం ద్వారా ఈ ఫాగ్‌ను కేవలం 30 సెకన్లలోనే తొలగించవచ్చు.
మరి ఆ సులభమైన ట్రిక్ ఏమిటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో కారు డ్రైవింగ్ చేసే సమయంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో విండ్‌షీల్డ్, మిర్రర్స్‌పై ఏర్పడే ఫాగ్ (మసక) ఒకటి. కారు లోపల తేమ ఎక్కువగా ఉండటం వల్ల గాజుపై పొగమంచులా పొర ఏర్పడి బయట దృశ్యం స్పష్టంగా కనిపించదు. ఇది డ్రైవింగ్ సమయంలో ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చు. అయితే ఒక చిన్న చిట్కాతో ఈ సమస్యను కేవలం 30 సెకన్లలోనే తగ్గించుకోవచ్చు.
వర్షాకాలంలో కారు కేబిన్‌లో తేమ (హ్యూమిడిటీ) అధికంగా ఉంటుంది. బయట చల్లని వాతావరణం, లోపల వెచ్చని గాలి కారణంగా గాజుపై నీటి ఆవిరి ఘనీభవించి ఫాగ్గా మారుతుంది. దీనివల్ల విండ్‌షీల్డ్, సైడ్ మిర్రర్స్ మసకబారిపోతాయి.
చాలామంది ఫాగ్ కనిపించగానే ఏసీని పూర్తిగా కోల్డ్ మోడ్‌లో ఆన్ చేస్తారు. కానీ దీనికంటే మెరుగైన ఫలితం కోసం ఏసీతో పాటు హీటర్‌ను కూడా ఉపయోగించాలి. ముందుగా కారు స్టార్ట్ చేసిన వెంటనే 30 నుంచి 60 సెకన్ల పాటు కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచండి. దీంతో కేబిన్‌లోని తేమతో కూడిన గాలి బయటకు వెళ్లిపోతుంది. అనంతరం కిటికీలు మూసి ఫ్రెష్ ఎయిర్ మోడ్‌ను ఆన్ చేయాలి. టెంపరేచర్‌ను స్వల్పంగా వెచ్చగా సెట్ చేసి హీటర్‌ను కూడా ఆన్ చేస్తే, గాజుపై ఉన్న తేమ వేగంగా తొలగిపోతుంది. దీంతో విండ్షీల్డ్పై ఏర్పడిన ఫాగ్ నిమిషం లోపే పూర్తిగా క్లియర్ అవుతుంది.
ప్రస్తుతం చాలా కార్లలో డీఫాగ్ లేదా డీఫ్రాస్ట్ ఫీచర్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే ఏసీ, హీటర్ వంటి సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతాయి. దీంతో ఫాగ్ మరింత వేగంగా తొలగిపోతుంది.
కారు హీటర్‌ను రీసర్క్యులేషన్ మోడ్‌లో ఉపయోగించడం మంచిది కాదు. అలా చేస్తే అదే తడి గాలి మళ్లీ మళ్లీ కేబిన్‌లో తిరుగుతూ తేమను పెంచుతుంది. దీంతో ఫాగ్ సమస్య మరింత ఎక్కువ కావచ్చు. అందుకే వర్షాకాలంలో ఎప్పుడూ ఫ్రెష్ ఎయిర్ మోడ్‌నే ఉపయోగించాలి.
ఏసీ గాలిలోని తేమను తగ్గిస్తే, హీటర్ ఆ గాలిని వెచ్చగా మారుస్తుంది. ఈ రెండు కలిసి పనిచేయడం వల్ల గాజుపై ఏర్పడిన తేమ త్వరగా ఆవిరైపోతుంది. దీంతో డ్రైవర్‌కు రహదారి స్పష్టంగా కనిపించి ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
చెవి గులిమి.. ఆరోగ్య రహస్యాలను చెబుతుందా?
ఆహారం తిన్న పళ్లెంలో చేతులు కడుక్కోకూడదట.. ఎందుకో తెలుసా?