
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాల్లో మహిళా నటీమణులకు అంతగా ప్రశంసలు ఉండవని, హీరోలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందంటున్నారు నటి తమన్నా (Tamannaah Bhatia). సుమారు
రెండు దశాబ్దాలుగా వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది, బాలీవుడ్ పరిశ్రమల మధ్య ఉన్న తేడాను వివరించారు.
‘‘హిందీలో ప్రధానంగా రెండు రకాల నటులుంటారు. నటనకు ప్రాధాన్యమిచ్చే వారు. గ్లామరస్ పాటలకు, డ్యాన్సులకు ఆసక్తి చూపేవారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేవారే అక్కడ సూపర్స్టార్లు అవుతారు. కానీ, సౌత్‌లో కమర్షియల్ సినిమాలకు ఒక నిర్దిష్టమైన ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ పితృస్వామ్య భావజాలం ఎక్కువ. హీరోయిన్లను చూసే విధానం అంత ప్రశంసనీయంగా అనిపించదు. సౌత్‌లోకి అడుగుపెట్టాకే నాకు అక్కడి పరిస్థితి అర్థమైంది. ఇది కేవలం నా వ్యక్తిగత అనుభవం మాత్రమే. ఇతరులకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ హంగులను సమన్వయం చేసుకున్న నటీమణులే 10 నుంచి 15 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించగలరు’’ అని విశ్లేషించారు.
ఇక, ప్రస్తుతం ఆమె ‘వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. మనీష్ పాల్, సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2026 ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. అదే రోజు శ్రద్ధా కపూర్ ‘ఈత’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కూడా బరిలో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొననుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరాఠీ సంప్రదాయ కళ ‘లవానీ’ని అభినయిస్తూ, ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు విఠాబాయి భావూ. ఇప్పుడు ఆమె జీవిత కథతో రూపొందిన చిత్రమే ‘ఈథ’(eetha).