
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ktr fires on cm revanth reddy and union minister kishan reddy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో విస్తరణ చుట్టు తిరుగుతున్నాయి. ఈక్రమంలో ఇప్పటికే రెండు రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజి బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సైతం భేటీ అయ్యారు. ఈ క్రమంలో మెట్రో ప్రాజెక్ట్ విస్తరణఅంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపైన రేవంత్ రెడ్డి కన్నుపడిందని ఎద్దేవా చేశారు.
30 వేల కోట్ల రూపాయల ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుంభకోణంకు సీఎం రేవంత్ రెడ్డి తెరతీశాడన్నారు. అందుకే మెట్రో రైల్ ఎల్ అండ్ టి అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారన్నారని విమర్శించారు. అందుకే 14000 కోట్ల రూపాయల ఎల్ అండ్ టి అప్పును రాష్ట్ర ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి రుద్దుతున్నాడని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో పట్ల చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు బీజేపీ ఎందుకు ఆమోదం తెలుపలేదని ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ప్రజల దృష్టి ఆకర్షించే విఫల ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేసిన రేవంత్ రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారని ఫైర్అయ్యారు.
రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఏదో తీసుకువచ్చినట్లు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు మొదలుపెట్టారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో అడ్డగోలుగా విమర్శలు చేసుకొని, ఢిల్లీలో కలిసినట్లు నాటకాలు ఆడుతూ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో పైన ఉన్న దగ్గర ఉన్న 250 ఎకరాల భూములను తన సొంత అన్నదమ్ములకు, బావమరిదికి, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు. కేవలం మెట్రో దగ్గర ఉన్న 30 వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఆస్తుల పైన కన్నేసి, మెట్రో రైల్ ఎల్ అండ్ టి అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం మెట్రో వేల కోట్ల ఆస్తుల కోసం ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ అండ్ టి 14 వేల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజల మీద రేవంత్ రెడ్డి రుద్దుతున్నారన్నారు. ఎల్ అండ్ టి కట్టవలసిన అప్పును ఇయ్యాల రాష్ట్ర ప్రభుత్వం కడతామని చెప్పి, మెట్రో రైళ్లను దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మెట్రో పైన ప్రేమ ఉన్నట్లు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం వెనుక ఒక్క భారీ కుంభకోణం ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు.నిజంగానే కిషన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు చేస్తున్నది డ్రామా కాకుంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన లగ్డీకాపూల్ నుంచి మెట్రో పటాన్చెరువు వరకు ప్రతిపాదిస్తే ఎందుకు బీజేపి ఆమోదం తెలపలేదన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న మెట్రో నగరాలకు మెట్రో ప్రాజెక్టులు అప్పనంగా ఇచ్చిన కేంద్రం ఎందుకు తెలంగాణకు మద్దతుగా నిలవలేదనని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
దీనితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎలాంటి భూసేకరణ లేకుండా మెట్రో రైల్ ప్రాజెక్టుని శంకుస్థాపన చేస్తే, రేవంత్ రెడ్డి వచ్చి దానిని వెంటనే రద్దు చేశారన్నారు. గత ప్రభుత్వ ప్రణాళికల హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేదని చెప్పుకొచ్చారు. కేవలం రేవంత్ రెడ్డికి ఆలోచన లేక, పరిపాలన ప్రాధాన్యతలు తెలయక మెట్రో రైల్ ప్రాజెక్టును రద్దు చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి వదిలేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుని 70 శాతానికి పైగా కేసీఆర్ గారు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టాలు ఎక్కాలి అంటే, ఎక్కాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాల్సిందే అని కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డివి.. తుగ్లక్ ఆలోచన విధానం ఉంది కాబట్టే, గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని రకాల ప్రజా ప్రయోజన ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ, కనీసం తన సొంత ఆలోచన మేరకు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నాని తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్ నగరంలో లక్షల మంది ఇండ్లను కూలగొట్టి, మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు తెరలేపారన్నారు. లక్షన్నర కోట్లతో మూసీ చేసేందుకు డబ్బులు ఉంటాయి కానీ, ఇచ్చిన హామీలను డిక్లరేషన్లను, 420 హామీలను అమలు చేయడానికి, గ్యారంటీలను అమలు చేయడానికి మాత్రం డబ్బులు ఉండవని కేటీఆర్ విమర్శించారు.
Read more: Brs ktr: బడే భాయ్, ఛోటే భాయ్ కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారు.!. షాకింగ్ నిజాలు బైటపెట్టిన కేటీఆర్..
భారత రాష్ట్ర సమితి తరఫున కార్యకర్తల కష్టంతో గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తన అవినీతి, అక్రమాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లోకి మారారన్నారు. మరల శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలి అంటే కార్యకర్తలంతా కలిసికట్టుగా కదం తొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.