
హైదరాబాద్: తెలంగాణలో ఐదు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయన్నారు.
ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందన్నారు. రేపు జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. TG: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు |