
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్‌లో ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనం కిందిభాగంలో తొలుత మంటలు చెలరేగాయి.
తర్వాత పైఅంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్‌కు ఎగబాకాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని 11 మంది మృతి చెందారు. కొందరు తమ ప్రాణాలను కాపాడుకొనేందుకు భవనం పైఅంతుస్తుల నుంచి కిందికి దూకారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి |