
చర్లపల్లి, జూన్ 22 : ఉప్పల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడలో రూ.
76లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, స్థానికులు, కాలనీవాసులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో డ్రైనేజీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని, కాలనీలలో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పనులను కాలనీవాసులు, నాయకులు పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా వెంకటేశ్, చక్రపాణిగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్ ముదిరాజ్, నందు, కృష్ణ, జయకృష్ణ, సంపత్, రాజులతో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.