
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు బ్యారెల్ 80 డాలర్లు దిగువన కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లో మరోసారి...
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు బ్యారెల్ 80 డాలర్లు దిగువన కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లో మరోసారి కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్లు కలిసొచ్చాయి.
సెన్సెక్స్ ఉదయం 77,160.67 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,802.90) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77,325.56 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 291.17 పాయింట్ల లాభంతో 77,094.07 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 89.80 పాయింట్ల లాభంతో 24,102.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.70గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్, బీఈఎల్ షేర్లు లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.17 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.