‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్లో కనిపించే ఈ చిన్నోడు అంటే మన తెలుగు ఆడియన్స్‌కి యమా ఇష్టం. మన ఇంట్లో అబ్బాయిగా కనిపించే ఈ కన్నడ కుర్రాడికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అంటే..
దానికి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌నే కారణం. ఈ సీరియల్లో రామరాజు చిన్న కొడుకుగా.. ప్రేమ భర్తగా తన అద్భుత నటనతో మెప్పిస్తున్నాడు. ఎక్కడో మైసూర్ నుంచి వచ్చి.. బెంగుళూరులో స్థిరపడి.. హైదరాబాద్‌కి పయనమై వచ్చి ధీరజ్ అసలు పేరు నితిన్ అద్వి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. సినిమాలు, సీరియల్స్ వైపు రావడానికి ఓ ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. మల్లి సీరియల్ హీరోయిన్ దీపా జగదీష్. అసలు నితిన్ తెలుగు సీరియల్స్‌లోకి ఎలా వచ్చాడు.? ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను పుట్టిపెరిగింది అంతా బెంగుళూరు. బట్ మా ఫ్యామిలీ మైసూర్ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డాం. ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్‌లో. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని. ఇంజనీరింగ్ మధ్యలో ఫెయిల్ అయితే.. ఖాళీగా ఉన్నప్పుడు యాక్టింగ్ మీదికి మనసు వెళ్లింది. చిన్న చిన్ని షార్ట్ ఫిల్మ్‌లు చేశాను. చాలా ఆడిషన్స్ ఇచ్చాను. కన్నడలో దాదాపు 62 ఆడిషన్స్ ఇచ్చిన తరువాత ఫస్ట్ సీరియల్‌కి సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్స్ ప్రాసెస్‌లోనే నేను యాక్టింగ్ నేర్చుకున్నా. నా ఫస్ట్ సీరియల్ ‘సర్ప సంబంధ’. అందులో సెకండ్ హీరోగా చేశాను. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క ఆ సీరియల్ చేసేవాడ్ని. చాలా సీరియల్స్, ఎపిసోడ్స్ చేస్తేనే కానీ గుర్తింపురాలేదు. జాబ్‌లో జాయిన్ అయ్యాను. కానీ నాకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ ఉండటంతో.. ఈ 9 గంటల జాబ్ మన వల్ల కాదు అని అనుకున్నా. యాక్టింగ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టా. తెలుగులో 2018లో ఎవరో ఒకరు అడిగారు. హైదరాబాద్‌కి రావాలని అడిగారు. నాకు ఎవరు చేస్తారులే.. ఇదో స్కామ్ అనుకుని కట్ చేసేశా. ఆ తరువాత వాళ్లూ చేయలేదూ.. నేనూ చేయలేదు. కన్నడ సీరియల్స్‌లో కొన్నాళ్లు చేసిన తరువాత సినిమాల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాను. డైరెక్షన్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లలో వర్క్ నేర్చుకున్నా. ఇండస్ట్రీలో ఉండాలంటే అన్ని క్రాఫ్ట్‌లపై అవగాహన ఉండాలి. కన్నడలో నా ఫస్ట్ మూవీ లక్ష్య. అందులో నాది ఇరిటేషన్ క్యారెక్టర్. మల్లి సీరియల్ ఫస్ట్ హీరోయిన్ దీపా జగదీష్‌తో కన్నడలో నేను ఒక సీరియల్ చేశా. అందులో నేను హీరోగా చేశా. తనతో రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాడ్ని. లాక్ డౌన్లో నాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది.. వర్క్ కూడా ఏం లేదు. ఆ టైమ్‌లో తను నాకు ఫోన్ చేసి ఏంచేస్తున్నావ్ అని అడిగింది. ఇదీ పరిస్థితి అని చెప్పేసరికి.. అసలు నాకు ఏం చెప్పకుండానే నా ఫొటోని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకుని అన్నపూర్ణ స్టుడియో వాళ్లకి పంపించింది. అప్పటికి తను అన్నపూర్ణ స్టుడియోస్లో ఒక ప్రాజెక్ట్ చేసింది. ఆమె నా ఫొటో పంపించగానే.. నాకు కాల్ వచ్చింది. దీపా జగదీష్ మీ నెంబర్ ఇచ్చారు.. హైదరాబాద్ వస్తారా? అని అడిగారు. ఎప్పుడూ అంటే.. ఈరోజు బయల్దేరండని అన్నారు. నాకు కంగారు వచ్చింది.. ఎందుకంటే నాకు బస్ చార్జీలకు కూడా డబ్బుల్లేవు. రెండు మూడు రోజుల తరువాత వచ్చాను. అప్పుడు ఆమె కాల్ చేసి తిట్టింది. అన్నపూర్ణ స్టుడియోస్ నుంచి ఫోన్ వస్తే ఆలస్యం చేస్తావ్ ఏంట్రా? ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని అన్నది. వాళ్లే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు.. మొత్తం వాళ్లే చూసుకుంటారు కదా.. ఎందుకు ఓవరాక్టింగ్ చేస్తున్నావ్ అని అన్నది. ఆ మాట అనగానే.. ఏంటీ వాళ్లు బుక్ చేస్తారా? వెంటనే వస్తానంటూ హైదరాబాద్‌కి వచ్చేశా. నన్నెందుకు తీసుకుంటారులే.. పోన్లే హైదరాబాద్ చూద్దాంలే అనుకున్నా. నాకైతే నమ్మకం లేదు. తెలుగు సీరియల్స్‌లో చేస్తానని అస్సలు అనుకోలేదు. సర్లే వచ్చాం కదా.. హైదరాబాద్ బిర్యానీ తినేసి పోవచ్చు అనుకున్నా. నమ్మకం లేకుండానే అన్నపూర్ణ స్టుడియోస్కి వెళ్లాను. ఫొటో షూట్ చేశారు.. ఛానల్ వాళ్లు కూడా ఓకే అన్నారూ. కానీ అక్కడ మేనేజర్ ఒకరు చెప్తున్నారు.. నాకు వేరే అర్థం అవుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల.. నేను ఇంగ్లీష్‌లో చెప్పేవాడ్ని. ఆయనకేమో ఇంగ్లీష్ రాదు. ఆయనేదో అగ్రిమెంట్ తీసుకొచ్చారు.. ఇదీ నీ క్యారెక్టర్ అని అన్నారు. నెక్స్ట్ జనరేషన్ స్టోరీలో మీ క్యారెక్టర్ వస్తుందని అన్నారు. అప్పటికే ఆ సీరియల్ వెయ్యి ఎపిసోడ్లను దాటేసింది. అరే ఏం చేస్తున్నా నేనూ అనుకున్నా కానీ.. నా లైఫ్‌లో నేను తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే.. నేను ‘కుంకుమపువ్వు’ సీరియల్‌కి సైన్ చేయడం. ఆ సీరియల్లో బంటి క్యారెక్టర్ చేశాను.. ఆ తరువాత ఇల్లు ఇల్లాలు పిల్లలు ధీరజ్‌గా మీ ముందుకు వచ్చానంటూ చెప్పుకొచ్చాడు నితిన్.