
నీట్ యూజీ 2026 పరీక్ష ఆదివారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ తప్పుడు ప్రచారాలని, వాటిని నమ్మోద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఈ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించినట్లు తెలియజేసింది. కావాలనే కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. కేవలం అధికారిక వెబ్సైట్ (neet.nta.nic.in) లోని సమాచారాన్ని మాత్రమే అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు : ఎన్టీఏ విజ్ఞప్తి |