
ప్రస్తుతం సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్లు లేదు అన్న చందంగా తయారైంది. మార్కెట్కు వెళ్లాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రస్తుతం సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్లు లేదు అన్న చందంగా తయారైంది. మార్కెట్‌కు వెళ్లాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి అరటి పండ్లు కూడా చేరిపోయాయి. ఏ కాలంలోనైనా, ఎక్కడైనా అత్యంత చౌకగా లభించే అరటి పండ్ల ధరలు ఒక్కసారిగా ప్రియమవ్వడంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది.గతంలో మార్కెట్‌లో సాధారణంగా డజన్ అరటి పండ్లు రూ. 40 నుంచి రూ. 50 లభించేవి. కానీ, ప్రస్తుతం వీటి ధరలు ఏకంగా రూ. 80 నుంచి రూ. 90కి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో నాణ్యతను బట్టి వంద రూపాయల మార్కును కూడా దాటేస్తున్నాయి. మెంతికూర కట్ట రూ.600. రేటు చూసి మహిళ షాక్దీంతో పేదవాడి ఆపిల్‌గా పిలుచుకునే అరటి పండును కొనాలన్నా సామాన్య కుటుంబాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పోషకాహారం కోసం తక్కువ ఖర్చులో దొరికే అరటి పండ్లపై ఆధారపడే జనం.. ఇప్పుడు పెరిగిన రేట్లను చూసి వెనకడుగు వేస్తున్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు ఇప్పుడు ఎంతో తెలుసా? అమ్మకాలకు బ్రేక్..దిగుమతులు తగ్గడమే ప్రధాన కారణం.. ఇంకా పెరిగే ఛాన్స్!మార్కెట్‌లో అరటి పండ్ల ధరలు ఇంతలా పెరగడానికి పంట దిగుమతి గణనీయంగా తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. వివిధ కారణాల వల్ల తోటల నుంచి మార్కెట్లకు వచ్చే లోడ్ తగ్గిపోవడంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక రేట్లు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా అధికమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరి, ధరల మంటతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న ఈ తరుణంలో.. మీ ఏరియాలో బనానా (అరటి పండ్ల) రేటు ఎలా ఉందో కామెంట్ చేయండి.