
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
నిజంగానే సమంత బాక్సాఫీస్ బంగారం: సమంత లాస్ట్ రెండు చిత్రాలు ‘శాకుంతలం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ సినిమా మంచి వసూల్లు సాధించినా.. బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేదు. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత సామ్ కథానాయికగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబి’ వంటి సక్సెస్ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత యాక్ట్ చేసిన ‘మా ఇంటి బంగారం’ నిర్మాతలకు నిజంగానే బంగారం తెచ్చిపెడుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర వీర విహారం చేస్తూ దూసుకుపోతుంది.
ఓ మాస్ హీరో తరహాలో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత ఎలివేషన్ సీన్స్‌కు మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అది వసూళ్ల రూపంలో కనిపించింది. అంతేకాదు ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే వాల్యూ బిజినెస్‌ను రికవరీ చేసి బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్‌గా నిలిచింది.
అంతేకాదు శుక్రవారం, శనివారాలతో పాటు నిన్న ఆదివారం అన్ని ఏరియాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోయింది. అంతేకాదు ఓ మీడియం రేంజ్ హీరో కన్నా.. సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే దాదాపు రూ. 43 కోట్ల గ్రాస్.. (రూ.20 కోట్ల షేర్) రాబట్టి ఔరా అనిపించింది. మొత్తంగా ఈ సినిమాలో సమంత మాత్రమే తెలిసిన ఫేస్ ఉంది. హీరోగా.. విలన్‌గా చేసిన వాళ్లు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఓ రకంగా సామ్ తన ఇమేజ్‌తో పాటు కథతో ఈ సినిమాను గట్టెక్కించిందనే చెప్పాలి.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే రూ. 20 కోట్ల షేర్‌తో రూ. 8 కోట్ల థియేట్రికల్ లాభాలను రాబట్టి ఈ యేడాది వన్ ఆఫ్ ది క్లీన్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. నిన్న ఒక్క రోజే బాక్సాఫీస్ దగ్గర రూ. 14 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్లో $1 మిలియన్ డాలర్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. కథానాయికగా సమంతకు ఇది 17వ సినిమా కావడం గమనార్హం. ఇక నాన్ థియేట్రికల్‌గా ఇప్పటికే రూ. 40 కోట్ల టేబుల్ ప్రాఫిట్‌ను నిర్మాతలు అందుకున్నారు. ఏది ఏమైనా సమంత మాత్రం నిర్మాతల పాలిట అసలు సిసలు బంగారంగా నిలిచిందనే మాట వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.