
మనీలా: ఫిలిప్పీన్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక పాఠశాల లోపల దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పులు కలకలం రేపాయి.
Jun 22 2026 11:12 AM | Updated on Jun 22 2026 11:13 AM
మనీలా: ఫిలిప్పీన్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక పాఠశాల లోపల దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పులు కలకలం రేపాయి. నిత్యం విద్యార్థుల సందడితో ఉండే క్లాస్‌రూమ్‌ల మధ్యే బుల్లెట్ల వర్షం కురవడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.
పాఠశాల ఆవరణలోకి చొరబడి.. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ సిటీ పరిధిలో గల ‘బారంగే సాన్ జోస్’ లోని ఒక పాఠశాలలో సోమవారం ఉదయం దాదాపు 9 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. పాఠశాల ఆవరణలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో మొత్తం ఎనిమిది మందికి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సమాచారం అందిన వెంటనే టాక్లోబన్ సిటీ పోలీస్ స్టేషన్-1 అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
ఒకరి అరెస్ట్.. మరొకరి కోసం వేట ఈ ఘటన అనంతరం పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని మైనర్‌గా గుర్తించారు. ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న రెండో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితులిద్దరూ స్థానిక బారంగే సాన్ జోస్ ప్రాంతానికి చెందినవారేనని ప్రాథమిక సమాచారం.
ఆస్పత్రిలో క్షతగాత్రులు.. దర్యాప్తు ముమ్మరం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే పేర్లను ప్రకటిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి గల కారణాలు, వారి లక్ష్యం ఏమిటనే దానిపై టాక్లోబన్ సిటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..
ఎవడివి రా నువ్వు.. నువ్వెంత నీ బతుకెంత.. పంతం నానాజీపై రెచ్చిపోయిన కారుమూరి
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!