
భారత్ సంసృతి సంప్రదాయాలను ఇష్టపడి ఇక్కడే ఉండిపోయారు ఎందరో విదేశీయలు. వాళ్లంతా ఈ నేలపై నచ్చిన అంశాలను కళ్లకు కట్టినట్లుగా వివరించి భారతీయులనే ఫిదా చేశారు.
Jun 22 2026 11:20 AM | Updated on Jun 22 2026 11:26 AM
భారత్ సంసృతి సంప్రదాయాలను ఇష్టపడి ఇక్కడే ఉండిపోయారు ఎందరో విదేశీయలు. వాళ్లంతా ఈ నేలపై నచ్చిన అంశాలను కళ్లకు కట్టినట్లుగా వివరించి భారతీయులనే ఫిదా చేశారు. తాజాగా మరో మహిళ భారత్ నుంచి ఆ నాలుగు పేరెంటింగ్ పాఠాలు నేర్చుకున్నానంటూ షేర్ చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇక్కడ పిల్లల పెంపకం విషయంలో ఆ నాలుగు విధానాలు తనకు ఎంతగానో నచ్చాయని, అమ్మ పెంపకం ఇంత గొప్పగా ఉంటుందని తెలుసుకున్నా అంటూ వాటి గురించి పూసగుచ్చినట్లు వివరించింది. మరి ఆ విదేశీ మహిళ మెచ్చిన ఆ పేరెంటింగ్ పాఠాలేంటో చూద్దామా!.
భారతదేశం నుంచి పిల్లల పెంపకానికి సంబంధించి ఆ నాలుగు అలవాట్లను తనలో భాగం చేసుకున్నాననంటూ యూరోపియన్ మహిళ క్సేనియా ఇన్స్టాగ్రామ్ వేదిక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో భారత్ నుంచి నేర్చుకున్న పెంపకపు అలవాట్లు తన పిల్లలను పెంచే విధానంను ఎలా మార్చాయో తెలిపింది. మొదట్లో తనకు మాతృత్వం చాలా కొత్తగా ఏదో అపరిచితంగా అనిపించింది.
కానీ భారత్కు వచ్చాక అది ఇష్టమైన కుటుంబ బాధ్యతలుగా అనిపించాయని అంటోంది. కొత్త దేశంలో స్థానిక సంప్రదాయలకు అనుగుణంగా పిల్లలను పెంచడం కాస్తా సవాలుగా ఉంటుందని కానీ, భారతీయ సంస్కృతి మాతృత్వాన్ని మధురంగా మార్చి సులభంగా మమేకమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అలాగే పిల్లల పెంపకానికి సంబంధించి తను మెచ్చిన భారత మాతృత్వ విధానాలు ఏంటంటే..
పిల్లలతో కలిసి నిద్రపోవడం.. పిల్లల చెంత పడుకోవడం తల్లి బిడ్డల మధ్య అనుబంధానికి వేదిక అని అంటోంది. బెడ్ షేర్ చేసుకోవడంలో భద్రంగా ఉన్నాననే భరోసా పిల్లల్లో కలుగుతుంది..తన బిడ్డతో పూర్తిగా గడుపుతున్నా అనే భావన తల్లిలోనూ కలుగుతుంది. ఇద్దరి మధ్య గాఢంగా పెనవేసుకునే బంధానికి ఇదే ప్రధానం అంటోంది.
రోజువారీ నూనె మర్దనలు.. భారత్ నుంచి స్వీకరించిన సంప్రదాయం..రోజువారి నూనె మర్దన. దీనిని మాలిష్ అని పిలుస్తారు. శిశు సంరక్షణకు సంబంధించింది..ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడే అంశం కూడా. ఇదొక అందమైన ఆచారంగా అభివర్ణించింది. ముఖ్యంగా తాతమయ్య నానమ్మలు ఈ పనిచేస్తూ తల్లికి చేదుడువాదోడుగా ఉంటారని అంటోంది. ఇది కుటుంబ అనుబంధానికి దోహదపడే అంశం కూడా అంటోందామె.
అర్థవంతమైన పేర్లు భారత్లో పిల్లల పేర్లు అర్థం, ఉద్దేశ్యం, గుర్తింపుని దృష్టిలో ఉంచుకుని ఎంచుకుంటారని అంటోంది. ఒక పేరును ఎంచుకోవడంలో ఎంతో ఆలోచన ఉంటుందో..అలాగే ఆ పేరు వెనుక సంస్కృతి, చరిత్ర విలువలతో లోతుగా ముడిపడి ఉంటుందని..అది తనకెంతో నచ్చిందని పేర్కొంది.
మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడం భారత్లో పిల్లల పుట్టిన రోజున తల్లి ఎంతో అందంగా రెడీ అవుతుంది. నిజానికి ఇది తల్లిగా మారడానికి సంబంధించిన వేడుక కూడా. అందుకే ఇక్కడ పిల్లల పుట్టిన రోజు వేడుకలకు తల్లులు చక్కటి చీర కట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తారు. తాను కూడా అలానే అందమైన చీర కట్టుకుని పిల్లల పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ పోస్ట్ నెటిజన్ల మనసుని తాకడమే కాదు.."అమ్మ మనకు ఎన్నో విషయాలను అందిస్తుంది... మా దేశంలో(భారత్) ఒక స్త్రీ తల్లి అయ్యాక, ఆమెకు తన బిడ్డ కంటే ముఖ్యమైనది ఏదీ ఉండదు. భర్తను కూడా పక్కన పెట్టేంతగా ఆమె బిడ్డపై శ్రద్ధ చూపిస్తుంది... మనకు అమ్మే సర్వస్వం. ఆమె దేవుడి కంటే గొప్పది, ఆమె ఒక సూపర్ ఉమెన్, జీవితంలో మనకు లభించే అంతులేని ప్రేమకు నిదర్శనం అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు.
(చదవండి: ప్రాణాంతక వ్యాధి లాస్ట్ స్టేజ్..ఐనా రోజుకు 12 గంటలు..!)
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మోసం చేశావ్ అన్నా.. నీకు చేతకాకపోతే చెప్పొచ్చు కదా..
పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..
ఎవడివి రా నువ్వు.. నువ్వెంత నీ బతుకెంత.. పంతం నానాజీపై రెచ్చిపోయిన కారుమూరి