మదన్, స్వాతి ఇద్దరూ సరదాగా ఉంటారు. మదన్ తింటున్న ఐస్ క్రీంను స్వాతి లాక్కుంటుంది. అలా ఇద్దరూ సరదాగా ఉండటం చూసి.. జంట చూడ ముచ్చటగా ఉంది కదా అని భ్రమరం, శేషు అనుకుంటారు.
వీరి పెళ్లి గురించి రేఖకి తెలియకుండానే స్టేజ్ మీద ప్రకటిస్తా అని భ్రమరాంబ అనుకుంటుంది. కానీ అంతకంటే ముందే రాజు తాగి వాగిన వీడియోని వేయిస్తుంది ఐశ్వర్య. అది చూసి భ్రమరాంబ షాక్ అవుతుంది. రేఖ అని గట్టిగా అరిచేస్తుంది. అందులో ఉన్న మాటల్ని విని రేఖతో పాటుగా అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి ఇదంతా నిజమా? దొంగ పెళ్లా? అని భ్రమరాంబ అడుగుతుంది. ఏంటమ్మా ఇదంతా అని అపర్ణా దేవీ అడుగుతుంది. నాకు ముందే డౌట్ వచ్చింది.. కిడ్నాప్ చేసిన వాడు.. పెళ్లి ఎలా చేసుకున్నాడా? అని భ్రమరాంబ అంటుంది. అక్క అబద్దం చెప్పదు.. ఆ వీడియోనే అబద్దం అయి ఉంటుంది అని స్వాతి అంటుంది. దీంతో రేఖకి కోపం వస్తుంది. నన్ను మోసం చేశారా? ఇది దొంగ పెళ్లా? వాడు అద్దె మొగుడా? అని రేఖ అడుగుతుంది. దీంతో ఐశ్వర్య నవ్వుతుంది. దొంగ దగ్గరకు వెళ్లి.. నువ్వే దొంగతనం చేశావా? అంటే ఏం సమాధానం చెబుతుంది అని అంటుంది ఐశ్వర్య.చివరి నిమిషంలో.. ఇదంతా అబద్దం ఆంటీ అని ఇందు కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది. అవునా..సరే.. మీది అబద్దపు పెళ్లి అని చెప్పేందుకు నా దగ్గర సాక్ష్యం ఉంది.. మరి మీ దగ్గర నిజం పెళ్లి అని చెప్పేందుకు సాక్ష్యం ఉందా? అని ఐశ్వర్య అడుగుతుంది. దీంతో ఇందు, రాజు కంగారు పడతారు. ఇక దొరికిపోయినట్టే అని రాజు అనుకుంటాడు. అందరూ అనుమానంగా చూస్తున్న వేళ.. నందు వస్తుంది. మ్యారేజ్ సర్టిఫికెట్, పోలీసు స్టేషన్లో వారి సమక్షంలోనే పెళ్లి జరిగింది.. ఇదే సాక్ష్యం అని నందు ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ను ఇస్తుంది. వాటిని చూసి ఐశ్వర్య షాక్ అవుతుంది.కవర్ చేసిన ఇందు.. నిజమైన పెళ్లే అయితే.. మరి ఆ వీడియో ఏంటి? అని రేఖ అడుగుతుంది. దీంతో ఇందు అది ఏఐ వీడియో అని కవర్ చేస్తుంది. అది ఏఐ వీడియోనే కదా అని రాజుకి సైగ చేస్తుంది. అవును అది ఏఐ వీడియో.. అందులో ఉన్నది నేనే.. ఆ వీడియో కూడా నిజమే కానీ.. ఆడియో మాత్రమే తప్పు అని అంటాడు. ఎవరైనా ఏ భర్త అయినా అలా చెప్పుకుంటాడా? అని రాజు నాటకం స్టార్ట్ అవుతాడు. అవును.. అల్లుడు ఎవ్వరూ కూడా అలా చెప్పరు అని శేషు అంటాడు. నేను చెప్పేదే నిజం అని ఐశ్వర్య అంటుంది.ఐశ్వర్యను ఆడుకున్న రాజ.. అక్కడే ఐశ్వర్యది ఓ వీడియో తీస్తాడు రాజు. అప్పటికప్పుడు ఎడిట్ చేస్తాడు. మా రేఖ ఆంటీ పిచ్చిది.. తింగర్ది.. అందుకే ఇలా వీడియో తీసి చూపెట్టాను.. నమ్మేస్తుంది అని.. అంటూ ఇలా ఐశ్వర్య మాట్లాడినట్టుగా ఎడిట్ చేస్తాడు రాజు. చూశారా.. మీ ముందే ఎడిట్ చేశా.. ఇక అక్కడెక్కడో ఉండి మా వీడియోని తీసింది ఐశ్వర్య. నేనేదో నా ఫ్రెండ్ కలిశాడని ఏవో ముచ్చట్లు పెడుతుంటే.. తనకు కావాల్సినట్టుగా ఆడియో మార్చుకుంది అని రాజు కవర్ చేస్తాడు. దీంతో ఐశ్వర్యని తిడుతుంది రేఖ. ముందే నీకు చెప్పా.. వారి విషయంలో దూరొద్దని, ఇప్పుడు అందరి ముందు పరువు తీశావ్ అని వెళ్లిపోతుంది రేఖ.ఐశ్వర్యకి ఇందు వార్నింగ్.. తప్పించుకున్నాను అని సంబరపడకు అని ఐశ్వర్య అంటుంది. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావ్ అని నాకు తెలుసు.. అందుకే నీ మీద కన్నేసి పెట్టా.. ఇంకోసారి నా జోలికి రావొద్దు.. ఆల్రెడీ కొట్టాను.. వార్నింగ్ ఇచ్చాను.. ఇంకోసారి నా గురించి ఆలోచిస్తే బాగోదు అని ఐశ్వర్యకు వార్నింగ్ ఇస్తుంది ఇందు. ఇప్పుడు తప్పించుకున్నావే.. నీ దొంగ పెళ్లి సంగతి.. నీది రాజు గాడిది వ్యవహారం బయట పెట్టకుండా.. మీ సంగతి చూడకుండా వదిలి పెట్టను.. త్వరలోనే మీ అంతు తేలుస్తా అని ఐశ్వర్య అనుకుంటుంది.నానమ్మకి ఏం చెప్పాలో.. ఈ రోజు నువ్వు లేకపోతే.. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం అంతా వృథా అయ్యేది.. థాంక్స్ నందు అని ఇందు చెబుతుంది. నువ్వు నా అక్కవి.. నాకు థాంక్స్ ఎందుకు అక్కా.. కాకపోతే ఇలా సడెన్గా చెప్పకు.. ముందే చెప్పు అని నందు అంటుంది. ఆ రాజు గాడు ఇలా చేస్తాడని ఊహించలేదు.. వాడి సంగతి చెప్పాలి అని ఇందు అంటుంది. ముందు నానమ్మకి ఏం చెప్పాలో ఆలోచించు.. అంతో ఇంతో అనుమానం అయితే వచ్చి ఉంటుంది కదా అని నందు అంటుంది. సరే.. అని ఇందు అంటుంది.రాజుని తిట్టిన ఇందు.. నీకు అసలు బుద్ది ఉందా? మందు కోసం కక్కుర్తి పడి అన్ని విషయాలు చెబుతావా? అని రాజుని తిడుతుంది ఇందు. కావాలని చేయలేదు.. ఏదో అలా జరిగింది అని రాజు అంటాడు. చీ నీకసలు సిగ్గు లేదా? మన కండీషన్స్ బ్రేక్ చేశావ్ అని ఫైర్ అవుతుంది. ఆ రోజు సంతకం పెట్టకుండా నిన్ను కాపాడాను.. ఈరోజు నన్ను నువ్వు కాపాడావ్.. మనం ఒకరినొకరం కాపాడుకున్నాం.. అంతే కదా.. మనం పార్ట్నర్స్ కదా అని రాజు అంటాడు. దీంతో ఇందుకి మరింత కోపం వస్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: మీనాని ఉడికించిన బాలు, సుందరి.. చుట్టం కాబోతోన్న మటన్ కొట్టు మాణిక్యం.. ఇక రోహిణి బతుకు బస్టాండే