
92 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈజిప్ట్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుపై 3-1తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: 92 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈజిప్ట్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ జట్టుపై 3-1తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. మ్యాచ్ ఆరంభంలో వెనుకబడిన ఈజిప్ట్.. రెండో అర్ధభాగంలో అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. మొస్తాఫా జికో తొలి గోల్ చేసి న్యూజిలాండ్‌తో సమం చేయగా.. మహ్మద్ సలాహ్ మరో గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ట్రెజెగెట్ మరొక గోల్ నమోదు చేసి ఈజిప్ట్ విజయాన్ని ఖాయం చేశాడు.
ప్రపంచకప్ వేదికపై ఎన్నోసార్లు నిరాశను ఎదుర్కొన్న ఈజిప్ట్ అభిమానులకు ఈ విజయం మరపురాని క్షణంగా నిలిచింది. 1934లో ప్రపంచకప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి తరం ఆటగాళ్ల నుంచి ప్రస్తుత సలాహ్ నాయకత్వంలోని జట్టు వరకు అందరి కలను ఈ విజయం సాకారం చేసింది. దీంతో ఈజిప్ట్ రెండు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్-జీలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో బెల్జియంతో 1-1తో డ్రా చేసుకున్న ఈజిప్ట్.. ఇప్పుడు చివరి లీగ్ మ్యాచ్‌లో ఇరాన్‌తో తలపడనుంది. మరోవైపు ఇరాన్-బెల్జియం మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరుజట్ల ప్లేయర్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో గ్రూప్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
బౌలర్లకు ఫీల్డర్ల మద్దతు అవసరం: హర్మన్‌ప్రీత్ కౌర్
వింబుల్డన్: సింగిల్స్ విభాగంలో బరిలోకి సెరెనా విలియమ్స్