
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
8th Pay Commission: 8వ వేతన సంఘానికి సంబంధించి పలు ఉద్యోగ సంఘాలు, అధికారులు, పెన్షన్ దారులు వినతిపత్రాలు, సూచనలు సమర్పించేందుకు గడువు 2026 జూన్ 15తో ముగిసింది. ఈ కీలక దశ పూర్తవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి డీఏ పెంపు ప్రకటనపై మళ్లింది. డీఏను ఈ సెప్టెంబర్ లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే 8వ వేతన సంఘం తన అధికారిక వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి జీతం, భత్యాలు, పెన్షన్ స్ట్రక్చర్ గురించి సూచనలను కోరింది. ఆల్ ఇండియా ఎన్ సిఎస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. కమిషన్ భాగస్వాములతో సంప్రదింపుల దశను పూర్తి చేసింది. ఇప్పుడు కమిషన్ ఉద్యోగులు, న్యాయాధికారులు, పెన్షనర్ల నుంచి అందిన వినతిపత్రాలను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఆపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా లెక్కిస్తుంది. ఏప్రిల్ 2026లో, ఈ సూచిక 0.8 పాయింట్లు పెరిగి 149.9కి చేరింది. డిఏను నిర్ణయించడానికి.. ప్రభుత్వానికి కనీసం2 నెలల డేటా అవసరం అవుతుంది. జూలై-డిసెంబర్ కాలానికి డిఏను కేవలం జూలై డేటా ఆధారంగా నిర్ణయించలేరు. కాబట్టి.. ప్రభుత్వం రెండు నుండి మూడు నెలల సగటు డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది.8వ వేతన సంఘం తన తుది నివేదికను సిద్ధం చేయడానికి ఇప్పుడు 10 నెలల సమయం మిగిలి ఉంది. దీనిని బట్టి ఉద్యోగుల జీతాలు, భత్యాలలో భారీ సవరణలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని స్పష్టమవుతోంది.
కేంద్ర ఉద్యోగుల సంస్థలు, యూనియన్లు తమ వినతిపత్రాలలో ప్రధానంగా ఈ డిమాండ్లను నొక్కి చెప్పాయి:
-కనీస ప్రాథమిక వేతనంలో భారీ పెరుగుదల ఉండాలి.
-పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలి లేదా NPS/UPSను సమీక్షించాలి.
-హెచ్ఆర్ఏ, రిస్క్ పే, బోనస్, సెలవు ప్రయోజనాలు ఇతర సేవా సంబంధిత సౌకర్యాలను మెరుగుపరచాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.