‘పుష్ప-2’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా 2024, ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన...
‘పుష్ప-2’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా 2024, ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడం, అక్కడ సరైన ముందస్తు రక్షణ చర్యలు లేకపోవడంతో సంభవించిన ఈ దురదృష్టకర ప్రమాదంలో రేవతి అనే మహిళ శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి, తాజాగా నాంపల్లి కోర్టులో కీలకమైన ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. * తెలుగు అక్షరాలు చూస్తే జిలేబీలు గుర్తొస్తాయి.. నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలుఈ ఛార్జ్‌షీట్‌లో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. థియేటర్ వద్ద భద్రతా లోపాలు, నిర్లక్ష్యానికి కారణమైన యాజమాన్యాన్ని ప్రధాన బాధ్యులుగా మారుస్తూ వారిని A1 నుంచి A10 నిందితులుగా చేర్చారు. ఇక ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా (A11) పోలీసులు చేర్చడం గమనార్హం. గతంలో ఈ వివాదానికి సంబంధించి అరెస్ట్, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల వంటి పరిణామాలు చోటుచేసుకోగా, తాజాగా ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. పోలీసులు సమర్పించిన నివేదికను పరిశీలించిన నాంపల్లి న్యాయస్థానం.. ప్రాథమిక ఆధారాల మేరకు అల్లు అర్జున్‌తో పాటు నిందితుఅ అందరికీ అధికారికంగా సమన్లు జారీ చేసింది. కేసు ట్రయల్స్ ప్రారంభం కావడానికి ముందు నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నేడు (సోమవారం) ఈ కేసు కోర్టు ముందుకు రానుంది. అయితే, ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో దర్శకుడు అట్లీ సినిమా షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన స్వయంగా హాజరయ్యే అవకాశం లేదు.* నెట్టింట వైరల్ అవుతున్న భాగ్యశ్రీ కామెంట్స్.. రామ్‌తో రిలేషన్‌ను అలా కన్ఫార్మ్ చేసినట్లేనా? ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ (వర్చువల్) ద్వారా హాజరయ్యేందుకు డిఫెన్స్ లాయర్లు అనుమతి కోరినప్పటికీ న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీనితో బన్నీ తరపు న్యాయవాది ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరై, ఆయన తరుపున తదుపరి లీగల్ ప్రొసీడింగ్స్, హాజరు మినహాయింపు పిటిషన్ వంటి వ్యవహారాలను చూసుకోనున్నారు. ప్రమాద బాధితుడైన శ్రీతేజ వైద్య ఖర్చులను అల్లు అర్జున్ భరిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలిచినప్పటికీ చట్టపరమైన ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. నేటి కోర్టు విచారణ అనంతరం న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై టాలీవుడ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.