
ఖిలా వరంగల్: వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో ఆదివారం కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. బాధితుడి కథనం ప్రకారం..
Jun 22 2026 9:22 AM | Updated on Jun 22 2026 9:22 AM
ఖిలా వరంగల్: వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో ఆదివారం కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. బాధితుడి కథనం ప్రకారం.. కిరాణా షాపులో పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్‌ను కట్ చేయగా అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. వెంటనే అతడు కిరాణా యజమానిని నిలదీసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు పెరుగు ప్యాకెట్ విక్రయించిన షాపును పరిశీలించారు.
వెంటనే ఆ బ్యాచ్‌కి సంబంధించిన ప్యాకెట్ల అమ్మకాలు నిలిపివేశారు. జనగామలో 50 ప్యాకెట్లు, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండ భవానీనగర్‌లోని షాపుల్లో ఆ బ్యాచ్‌కి చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విక్రయించొద్దని షాపు నిర్వాహకులను ఆదేశించారు. వరంగల్ జిల్లా ఫుడ్ ఆఫీసర్ మౌనిక కరీమాబాద్‌లో తనిఖీలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, ఆ బ్యాచ్‌కు సంబంధించిన పెరుగు అమ్మకాలు నిలిపివేసి శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు.
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..