
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి.
నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలో తాజాగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. జోధ్‌పూర్ - చెన్నై బీచ్ మధ్య ఇవి అందుబాటులోకి రానున్నాయి. మొదటి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27వ తేదీన పట్టాలెక్కనుంది. జులై చివరి వారం వరకూ రాకపోకలు సాగిస్తుంది. ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. వీటికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయి. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కూడా ఆరంభమైంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ రూట్ లో దీన్ని నడిపించనున్నారు.ఈ నెల 27, జూలై 4, 11, 18, 25 తేదీలలో (ప్రతి శనివారం) జోధ్‌పూర్‌ నుంచి రాత్రి 9.20 నిమిషాలకు బయలుదేరే నంబర్ 04815 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ మూడో రోజు రాత్రి 8 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్ కు చేరుకుంటుంది. మొత్తం అయిదు ఎక్స్ ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.ఈ నెల 30, జూలై 7, 14, 21, 28 తేదీలలో (ప్రతి మంగళవారం) సాయంత్రం 5.15 నిమిషాలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే నంబర్ 04816 ఎక్స్‌ప్రెస్ మూడో రోజు రాత్రి 8.30 గంటలకు జోధ్‌పూర్ చేరుకుంటుంది. మొత్తం 2 ఏసీ టూ-టైర్ కోచ్‌లు, 15 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 2 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు ఉంటాయి.మెర్టా రోడ్, డేగానా, మక్రానా, కుచామన్ సిటీ, ఫులేరా, జైపూర్, దుర్గాపురా, సవాయ్ మాధోపూర్, సోగారియా, బారన్, ఛాబ్రా గుగోర్, రూథియా, గుణ, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పుర్, బలార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.