
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
నీట్ పరీక్ష మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్టు: దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశించే వారికి కోసం నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన భద్రతల నడము నిర్వహించింది. నీట్ పరీక్ష నేపథ్యంలో ప్రశ్నా పత్రాలు లీక్ కాకుండా టెలిగ్రామ్ వంటి యాప్స్‌పై కొన్ని రోజుల పాటు నిషేధం విధించింది.
తాజాగా నిన్న జరిగిన నీట్ ఎగ్జామ్ లో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ విద్యార్ధి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకొని టాయిలెట్ వెంటిలేటర్ ద్వారా మొబైల్ లోపల పెట్టి వెళ్లాడు. పరీక్ష జరుగుతున్న సమయంలో విద్యార్ధి కడుపు నొప్పి అంటూ టాయిలెట్‌కు వెళ్లాడు సదరు విద్యార్ధి.
విద్యార్ధి టాయిలెట్లోకి వెళ్లి చాలా సేపటి వరకు రాకపోవడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్‌లో నీట్ ఎగ్జామ్‌లో వచ్చిన ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అతను మొబైల్ ఫోన్ పెట్టడం దగ్గర నుంచి అన్ని వివరాలపై కూపీ లాగుతున్నారు. ఇందులో ఇతని ఒక్కడి ప్రమేయం ఉందా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భావి భారత డాక్టర్లు కావాల్సిన వాళ్లు ఇలా చీటింగ్ చేసి ఎగ్జామ్ రాయడం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే అవకాశాలున్నాయి. మన దగ్గర డాక్టర్ వృత్తిని పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో నీట్ ఎగ్జామ్‌లో పాసై ఆ తర్వాత మెడికల్ కాలేజీలో సీట్స్ సంపాదించి నాలుగేళ్ల వైద్య వృత్తిని అభ్యసించాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం పదేళ్లు తమ జీవితాన్ని అంకితం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఎగ్జామ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే.. ఇలా మాల్ ప్రాక్టీస్ చేసి వైద్య వృత్తిలోకి వచ్చే వారితో సభ్య సమాజానికి చేటు తప్పదు. అందుకే ప్రభుత్వం నీట్ సహా ఏ ఎగ్జామినేషన్ విషయంలోనైనా ఇలాంటి అవకతవకులకు సిబ్బంది పాల్పడకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.