శ్రీవల్లి కడుపు బాగోతాన్ని బయటపెట్టడంలో భాగంగా.. రోజుకో రకం కచేరీ మొదలుపెట్టారు నర్మద, ప్రేమలు. ఈరోజు (జూన్ 22) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే..
శ్రీవల్లి ముందు చిప్స్, కూల్ డ్రింక్ పెట్టి ‘కర్రతో కచేరీ’ అనే కార్యక్రమానికి తెరతీస్తారు నర్మద, ప్రేమలు. కళ్లకి గంతలు కట్టేసి కొట్టాలా వద్దా అనే ఆట ఆడుతారు. కళ్లకి గంతలు కట్టేసుకుని శ్రీవల్లితో చెడుగుడు ఆడుకుంటారు. శ్రీవల్లి, సుకన్యల వైపు వేలు చూపించేసరికి కళ్లకి గంతలు కట్టుకున్న నర్మద కాళ్లని తొక్కుతుంది ప్రేమ. దాంతో నర్మద.. కొట్టాలి అని అంటుంది. అప్పుడు కర్రతో వాయించిపారేస్తుంటుంది ప్రేమ. అలా వల్లీ, సుకన్యలకు వీరబాదుడు బాదేస్తారు. తూచ్ తండీ.. నీ కళ్లకి కనిపిస్తుంది. నీకు కాదు.. ప్రేమకి కళ్లగంతలు కడతాను అని అంటుంది శ్రీవల్లి. పర్సన్ మారుతుంది కానీ.. బాదుడు మాత్రం మారదు. శ్రీవల్లి కంటే కూడా సుకన్యనే ఎక్కువ దరువు వేసేసరికి.. మెయిన్ వికెట్‌ని వదిలేసి నన్ను కొడతారేంటి? అని అంటుంది సుకన్య. పాపం కడుపుతో ఉంది కదా అని ప్రేమ అంటే.. ‘ఎవరు అన్నారు కడుపుతో ఉందనీ’ అంటూ నోరు జారేస్తుంది సుకన్య.ఏంటీ బలక్క.. కడుపుతో లేదా?? లేదా?? లేదా?? ‘హా లేదూ’ ఆ మాటతో షాక్ అయిన ప్రేమ, నర్మదలు.. ఏంటీ బల్లక్కాయ్ కడుపుతో లేదా? అని అంటారు. అబ్బే ఆ డైలాగ్ మీనింగ్ అది కాదు. ఆటలో దిగినప్పుడు అందరూ సమానమే అని నా ఉద్దేశం.. కడుపుతో లేదు అని అనుకోవాలి తప్ప.. జాలి చూపించి వాళ్లని వదిలేసి పక్కోళ్లని పిచ్చ కొట్టకూడదు కదా అని అంటుంది సుకన్య. అబ్బో మరి వల్లీ ఆట కూడా నేనే ఆడతా అన్నావ్ కదా.. ఇదేనా? అది అని అంటుంది నర్మద. ‘మరీ ఈ రేంజ్లో ఉంటుందని తెలియకా.. అయినా ఆవిడ తిట్లు నేను తింటున్నానా?? ఆమె తిండి నేను తింటున్నానా? మరి ఆమె దెబ్బలు నేను తినడానికి? రేపటి లోగా తేల్చాద్దాం.. ‘హా తేల్చారులే బోడీ’ ఆ దెబ్బలేవో ఆవిడ్నే కొట్టండమ్మా’ అంటూ అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది సుకన్య. బల్లక్కాయ్.. కచేరీ మళ్లీ మొదలుపెడదామా? అని నర్మద అంటే.. కడుపులో బిడ్డ నిద్రపోతుంది.. నేను జంప్ అంటూ అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది శ్రీవల్లి. అక్కా.. వల్లీ కడుపుతో ఉందా అని సుకన్య అనడం వెనుక ఏదో తేడా ఉందనిపిస్తుంది అని ప్రేమ అంటే.. ‘నాకూ అదే డౌట్ ఉంది.. రేపటిలోగా తేలుద్దాం’ అని అంటుంది నర్మద. ఇక నర్మద, ప్రేమలు చావబాదడంతో దెబ్బలకు వెన్నపూస రాసుకుంటూ ఉంటుంది సుకన్య. ఇంతలో తిరుపతి వచ్చి.. ‘నిన్ను ఎవరు కొట్టారు.. ఎవరు కొట్టారూ’ అని తెగ నటించేస్తుంటాడు. పతీ.. నా తిరుపతీ.. కుక్కలా ఆడించిన సుకన్య ఏయ్.. కొట్టారు కాదు.. కుట్టాయి.. దోమలు కుట్టాయి అని అంటుంది సుకన్య. అరెరే.. నేను ఆ దోమనైనా కాకపోతినే అంటూ టకీమని వెళ్లి.. వేపాకు దూపం తీసుకుని వస్తాడు తిరుపతి. ఈ పొగ దెబ్బకి దోమలు కాదు.. నేనే పోయేలా ఉన్నాను అని వెళ్లిపోతుంటుంది సుకన్య. ఆగు సుక్కూ.. ఆగు సుక్కూ.. నీకోసం నేను కోసేసుకుంటా.. అదే గుండెకాయ అని అని అంటాడు తిరుపతి. ఇక చేతిలో ఉన్న నిప్పుల దూపం కిందపడటంతో దానిపై కాలు వేసి.. కెవ్వు మంటాడు తిరుపతి. అది చూసి మెలికలు తిరుగుతూ సుకన్య.. ‘పతీ.. తిరుపతీ.. నాకోసం నీ గుండెను కోసి ఇస్తానని అన్నావ్ కదా.. అందుకు నీకోసం ఒకటి ఇవ్వాలి.. రా.. ఇటు రా’ అని వయ్యారంగా పిలుస్తుంది. ఆ కాలిన కాళ్లతోనే ఇల్లు మొత్తం తిప్పిస్తుంది. ఓ పక్క బాధని భరిస్తూనే సుక్కూ చుట్టూ కుక్కలా తిరుగుతాడు. నీ ఒంపుసొంపులు మతిపోగొట్టాయ్.. మీరు డాన్స్ కాంపిటేషన్‌కి సెలెక్ట్ అయ్యారు.. మరోవైపు.. డాన్స్ కాంపిటేషన్ పేరుతో ప్రేమకి వల వేస్తున్న రాజపుష్పం.. నేరుగా ప్రేమకి కాల్ చేస్తాడు. ‘మాట్లాడేది ప్రేమేనా?? మీరు డాన్స్ కాంపిటేషన్‌కి సెలెక్ట్ అయ్యారు.. అని అంటాడు రాజపుష్పం. ఆ మాట వినగానే.. ఏంటీ నిజమా? అంటూ ఉప్పొంగిపోతుంది ప్రేమ. ‘అవును నిజంగానే మీరు సెలెక్ట్ అయ్యారు.. మీలాంటి నాట్య మయూరిని సెలెక్ట్ చేసినందుకు నేను నిజంగానే గర్వపడుతున్నాను’ అని అంటాడు రాజపుష్పం. ‘నిజంగా నమ్మలేకపోతున్నాను’ అని ప్రేమ అంటే.. ‘నమ్మాలి.. మీ ఒంపులు సొంపులు మతిపోగొడుతున్నాయి’ అని అంటాడు రాజపుష్పం. ‘ఏంటీ ఏమన్నారూ’ అని ప్రేమ అనడంతో..‘అదే.. మీ డాన్స్ మూమెంట్స్ అద్భుతం అని చెప్తున్నా. మిమ్మల్ని చూశాక నిద్ర పట్టడం లేదు.. మీరు నాకు కావాలి.. మిమ్మల్ని మీ డాన్స్‌ని చూసిన తరువాత నుంచి నిద్ర పట్టడం లేదు.. ఐ వాంట్ యూ’ అని అంటాడు రాజపుష్పం. ఏంటీ.. ఏమన్నారూ అంటూ మళ్లీ అడుగుతుంది ప్రేమ. అదే.. వియ్ వాంట్ యూ.. మీలాంటి కళాకారిణి మాకు కావాలి.. మీరు ఖచ్చితంగా కాంపిటేషన్‌లో పార్టిసిపేట్ చేయాలి.. అని అంటాడు రాజపుష్పం. ఆ మాటతో ప్రేమ.. ‘మా ఇంట్లో వాళ్లని అడిగి చెప్తాను’ అని అంటుంది. అంత పెద్ద కళాకారిణికి పర్మిషన్ ఏంటమ్మా.. మీరు ఎలాగైనా రావాలి.. తప్పుకుండా రావాలి.. ఈ కాంపిటేషన్‌లో గెలిస్తే పది లక్షలు వస్తాయి.. నాకు నమ్మకం ఉంది.. తప్పకుండా మీరే గెలుస్తారు’ అని అంటాడు రాజపుష్పం. నీకోసం ఎదురుచూస్తుంటా.. ఫోన్లో ముద్దులు నేను డాన్స్ కాంపిటేషన్‌కి రావడానికి 100 పర్సెంట్ ట్రై చేస్తాను సార్.. అని ప్రేమ అంటే.. ‘ట్రై చేయడం కాదు.. ఇంకో నాలుగు రోజుల్లో కాంపిటేషన్ ఉంది.. తప్పకుండా రావాలి.. మళ్లీ మళ్లీ అవకాశం మీకూ రాదు.. నాకూ రాదు.. ఇద్దరం సద్వినియోగం చేసుకుందాం.. నీకోసం ఎదురుచూస్తుంటా’ అని అంటాడు రాజపుష్పం. సరే సార్ అని ప్రేమ అనడంతో.. ఫోన్లోనే ముద్దులు పెట్టేస్తూ కామంతో కట కటలాడిపోతుంటాడు రాజపుష్పం. వాడి నిజస్వరూపం ఏంటో తెలియని ప్రేమ.. తెగ మురిసిపోతుంటుంటుంది. ఈ విషయం ధీరజ్ గాడికి చెప్పి ఎలా ఒప్పించాలీ? అంటూ ధీరజ్ దగ్గరకు పరుగు తీస్తుంది ప్రేమ. ఒడియమ్మా.. ఇదేందిదీ ధీరజ్ తల స్నానం చేసి వచ్చేసరికి.. టవల్‌తో దర్శనం ఇచ్చి.. ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో అంటూ సాంగ్ వేసుకుని.. వయ్యారాలు ఒలకబోస్తూ తల తుడుస్తుంటుంది. ఒసేయ్..ఈ కొత్త కొత్త వేషాలు ఏంటే.. మామూలుగా తుడవొచ్చు కదా అని అంటాడు ధీరజ్. అయితే ప్రేమ మాత్రం పరవశించిపోవడం ఆపదు. ధీరజ్ని పట్టుకుని తెగ స్టెప్లు వేస్తుంది. తల తుడిచి.. బట్టలు తెచ్చి ముస్తాబు చేస్తుంది. ఆ తరువాత ప్రేమగా టిఫిన్ కూడా తినిపిస్తుంది. అనంతరం ధీరజ్ ముందే భరతనాట్యం చేసి తన టాలెంట్ చూపిస్తూ ఉంటుంది ప్రేమ. ఆ డాన్స్ చూసి.. వహ్ వా.. వహ్ వా అని అంటాడు ధీరజ్. వాహ్ వా.. వహ్ వా.. నీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో చేసే పనుల్నే డాన్స్‌గా చేసి ఇరగదీశావ్ కదా.. నీలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదే’ అని తెగ పొగిడేస్తుంటాడు ధీరజ్. దానికి మురిసిపోయిన ప్రేమ.. అంటే నాకు ప్రైజ్ మనీ వచ్చేసినట్టేనా? అని అంటుంది. హలో ప్రైజ్ మనీ అంటున్నావ్ ఏంటీ.. అసలు నిన్ను ఎవరు డాన్స్ కాంపిటేషన్‌కి పిలిచేదీ అని అంటాడు ధీరజ్. ఆల్రెడీ పిలిచారు.. నీ పర్మిషన్ కోసం వెయిటింగ్ అంతే. నువ్వు ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పావ్ అంటే.. డాన్స్ కాంపిటేషన్‌కి వెళ్లి.. పార్టిసిపేట్ చేసి.. ప్రైజ్ మనీ కొట్టుకుని వస్తానురా.. పర్మిషన్ ఇచ్చినట్టే కదా’ అని అంటుంది ప్రేమ.వెళ్లడానికి వీళ్లేదు.. దాంతో ధీరజ్.. పర్మిషన్ కాదు.. లాగిపెట్టి ఒక్కటిస్తా అంటూ చేయిలేపుతాడు. ఇప్పటి వరకూ నువ్వు చేసిన విన్యాసాలన్నీ నా పర్మిషన్ కోసమా? ఈ దిక్కుమాలిన తెలివితేటలే తగ్గించుకో అని అంటాడు ధీరజ్. అదేంట్రా అలా అంటావ్.. పది లక్షల ప్రైజ్ మనీ అంటరా.. ఖచ్చితంగా గెలుస్తాను.. ఆ డబ్బుతో నీకు కారు కొనిస్తాను’ అని అంటుంది ప్రేమ. ఏం అవససరం లేదు.. నోరు మూసుకో అని అంటాడు ధీరజ్. ఎందుకు వద్దంటున్నావ్ రా అని ప్రేమ అంటే.. ‘వద్దు తల్లీ వద్దూ.. ఆరోజు నువ్వు డాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్తేనే మీ వాళ్లు మా ఇంటిపై దండెత్తి మా నాన్నని నానా మాటలు అన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్లి స్టేజ్‌పై డాన్స్‌లు చేస్తే కత్తులతో యద్దానికి వస్తారు. ఇంతకీ ఆ పార్శిల్ అదే కదా.. నేను కారుకొనుక్కోకపోయినా పర్లేదు.. కానీ నా కారణంగా మా నాన్న రోడ్డుపై నిలబడకూడదు. మీ వాళ్లతో అవమానాలు పడకూడదు.. దయచేసి అర్థం చేసుకో’ అని కుండబద్దలు కొట్టి వెళ్లిపోతాడు ధీరజ్. అయితే ప్రేమ మాత్రం.. వీడ్ని ఎలాగోలా ఒప్పిస్తా అని అనుకుంటుంది. మరోవైపు.. నర్మదకి కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ వస్తే.. శ్రీవల్లి వెళ్లి మా చెల్లేలే ఇలా ఇవ్వు అని అంటుంది. అలా ఇవ్వడం కుదరదు.. కోడ్ చెప్పాలి అని కొరియర్ బాయ్ అంటే.. అతి తెలివి చూపిస్తుంది శ్రీవల్లి. తన ఇంట్లో ఉన్న కోళ్ల గురించి చెప్తుంది.. మేడమ్ కోడ్ అంటే కోసుకుని తినే కోళ్లు కాదు అని గాలి తీసేస్తాడు కొరియర్ బాయ్. ఇంతలో నర్మద వచ్చి కోడ్ చెప్పి.. ఆ పార్శిల్ని తీసుకుంటుంది. ఇంతకీ ఆ పార్మిల్లో ఏమందీ అని శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తుంది కానీ.. ఆరోజు ఆఫీస్‌లో నిజాన్ని రాబట్టే మెషీన్ అని డ్రామా నడిచింది కదా.. అదీ ఇది అయ్యి ఉండొచ్చు. చూద్దాం ఏమౌతుందో.