స్నేక్ ప్లాంట్ మొండి మొక్క అనొచ్చు. ఇప్పుడే మొక్కలు పెంచుతున్న వారు కూడా హాయిగా ఈ మొక్కను ఎంచుకోవచ్చు. మీ బాత్రూమ్కు ఈ మొక్క ప్రశాంత వాతావరణం తీసుకొస్తుంది. తక్కువ కాంతిలో, తేమలో బాగా పెరుగుతుంది.
నీరు కూడా తక్కువ తీసుకుంటుంది. ఈ మొక్కను మెయింటేన్ చేయడానికి ఎక్కువగా కష్టపడనవరం లేదు. వారానికి ఒకటి రెండు సార్లు నీరు పోసినా సరిపోతుంది. అంతేకాదు ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ బాత్రూమ్కు ఈ మొక్క బెస్ట్ అని చెప్పొచ్చు.
ఇండోర్ ప్లాంట్స్‌లో స్పైడర్ ప్లాంట్ చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ మొక్కలు చూడటానికీ ఎంతో బాగుంటాయి. ఆకులు ఆకుపచ్చ-తెలుపు చారలతో జాలువారుతున్నట్లు ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టపడతారు. మీ బాత్రూమ్కు ఈ మొక్క అందమైన లుక్ ఇస్తుంది. ఈ మొక్కలు తక్కువ కాంతిలోనూ బాగా పెరుగుతాయి. వారానికి రెండు, మూడు సార్లు నీరు పోస్తే సరిపోతుంది. ఈ మొక్కలను హ్యాంగింగ్ కుండీలలో పెట్టి మీ బాత్రూమ్లో వేలాడదీయండి.
మీ బాత్రూమ్ వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడానికి చైనీస్ ఎవర్గ్రీన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవి బాత్రూమ్లోని తేమతో కూడిన వాతావరణాన్ని ఇష్టపడతాయి. వీటిలో 20 రకాలకు పైగా ఉంటాయి. మీకు ఇష్టమైనవి ఎంచుకోవచ్చు. వీటికి ప్రతి 10 నుండి 12 రోజులకు నీరు పెట్టాలి. ఒకవేళ మీరు అప్పుడప్పుడు మర్చిపోయినా ఇవి తట్టుకుంటాయి. ఆకులు దెబ్బతినకుండా ఉండటానికి వాటిని గాలి ప్రవాహాలకు దూరంగా ఉంచండి.
మనీ ప్లాంట్.. మన భారతదేశంలో ఫేమస్ ఇండర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. తేమతో కూడిన బాత్రూమ్లలో మనీ ప్లాంట్ అద్భుతంగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ వెలుగు కూడా అవసరం లేదు. దీనిని మట్టిలో, నీటిలో కూడా పెంచవచ్చు. దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. వారానికి రెండు సార్లు నీరు పోస్తే సరిపోతుంది. ఒకవేళ మర్చిపోయినా కూడా పెద్దగా పట్టించుకోదు.
లక్కీ బాంబూ.. ఈ మొక్క చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. మీ బాత్రూమ్లో పెట్టుకోవడానికి ఎంతో బాగుంటుంది. ఈ మొక్కను నీళ్లలో, మట్టిలోనూ పెంచొచ్చు. ఇది తక్కువ వెలుతురు లేదా కృత్రిమ కాంతిలోనూ బాగా పెరుగుతుంది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి