
Horoscope Today 22 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది.
కుజుడు వృషభంలోకి ప్రవేశించిన కారణంగా మేషం సహా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి. కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఇంటా బయటా ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృషభ రాశి వారు ఈరోజు ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది.
మిథున రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటక రాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు అందుతాయి.
కన్య రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
తుల రాశి వారికి ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార,ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.
వృశ్చిక రాశి వారికి ఈరోజు బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనుస్సు రాశి వారు ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు వస్తాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
కుంభ రాశి వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
మీన రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగ యత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.