ఎండ తీవ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ ముప్పు పొంచి ఉంటోంది. ఈ పరిస్థితి వల్ల పుదీనా వాటర్ , వట్టివేళ్ల నీరు (ఖుస్ వాటర్) వంటి సంప్రదాయ శీతల పానీయాలకు ఆదరణ పెరుగుతోంది.
ఈ వేసవి పానీయాలకు వాటి చలువ చేసే గుణాల కారణంగా పూర్వం నుంచి సేవిస్తున్నారు. పుదీనా వాటర్, వట్టివేళ్ల నీరు శరీరానికి అంతర్గతంగా చలువ చేస్తాయని సైన్స్ కూడా చెబుతోంది. పుదీనాలో ఉండే మెంతాల్ వేసవి కాలంలో శరీరానికి అంతర్గత కూలెంట్‌గా పనిచేస్తుందని, ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది. వట్టివేళ్ల వాటర్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన ఫెనోలిక్ యాసిడ్స్, టెర్పెనాయిడ్స్ ఉండటం వల్ల ఇది వేసవిలో శరీరానికి అంతర్గతంగా చలువ చేయడానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, వడదెబ్బ వంటి సమస్యలను నివారించడానికి వేసవిలో ఇలాంటి శీతల పానీయాలు ఎంతైనా అవసరం. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయి. పుదీనా వాటర్ ఎందుకు?పుదీనా వాటర్ చలువ చేసే, జీర్ణక్రియను మెరుగుపరిచే, ఉత్తేజాన్నిచ్చే గుణాలు కలిగిన పుదీనా ఆకుల ఫ్లేవర్ కలగలిసిన నీరు. వేసవి కాలంలో దీనిని బాగా ఎక్కువగా తాగుతుంటారు. ఇక పుదీనాలో మెంతాల్ ఉండటం వల్ల ఇది వేసవి వేడిని తట్టుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ మెంతాల్ జీర్ణకోశ కండరాలు విశ్రాంతి పొందేలా చేస్తుంది. అంతే కాకుండా ఇందులో రోస్మరినిక్ యాసిడ్ వంటి పాటీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంట లేదా వాపును తగ్గిస్తాయి. అలాగే పుదీనా ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించడంలో బాగా పనిచేస్తాయి. దీనిని తయరు చేసుకోవడం కూడా చాలా సులభం. పుదీనా ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిలో కొంచెం నిమ్మరసం (ఆప్షనల్) కలుపుకుని తాగవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ బాగుండటమే కాకుండా కడుపు ఉబ్బరం, డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఎండ వల్ల కలిగే వికారం, అలసట నుంచి కాపాడుతుంది. వట్టివేళ్ల నీళ్లు తాగడం వల్లఈ వాటర్‌ను సాంప్రదాయ ఆయుర్వేద శీతల పానీయంగా పిలుస్తారు. ఇది శరీరానికి లోపలి నుంచి తీవ్రమైన చలువను, మానసిక ప్రశాంతతను అందిస్తుందని సైన్స్ డైరెక్ట్ అధ్యయనం పేర్కొంది. అలాగే ఈ వాటర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎండ వల్ల కలిగే అలసట, ఒత్తిడి, శరీరంలో వచ్చే మంట లేదా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ వట్టివేళ్లను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీటిని వడకట్టుకుని ఆ వాటర్ అలాగే తాగడం లేదా తేనె వంటి స్వీట్నర్స్ యాడ్ చేసుకుని తాగడం చేయాలి. ఇది ప్రకృతి సిద్ధంగా లభించే శక్తివంతమైన బాడీ కూలెంట్. శరీరంలో పెరిగే అంతర్గత వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మానసిక ప్రశాంతతను కలిగించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఏ డ్రింక్ ఎక్కువ చలువ చేస్తుంది?పుదీనా వాటర్, వట్టివేళ్ల నీరు ఈ రెండింటిలో శరీరానికి ఎక్కువ చలువ చేసేది అంటే వట్టివేళ్ల నీరే. ఎందుకంటే బాడీ హీట్‌ను తగ్గించే శక్తివంతమైన సమ్మేళనాలు వట్టివేళ్ల నీటిలో పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటి రుచి అందరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి దీనిని ప్రతిరోజూ తాగడం కష్టం. మరోవైపు రోజువారీ హైడ్రేషన్, జీర్ణక్రియ మెరుగుపడటానికి పుదీనా వాటర్ చాలా మంచిది. కానీ ఏదైనా తగిన మోతాదులోనే తీసుకోవడం శ్రేయస్కరం. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది, పాటించాలనేది పూర్తి మీ వ్యక్తిగత అభిప్రాయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.