
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు తిరువళ్లూర్లోని ఓ ప్రైవేటు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది
కి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతంలో పర్యటించిన స్థానిక కలెక్టర్ బాధిత కార్మికులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సంబంధిత మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనలో ఫ్యాక్టరీ యజమానితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.