
ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి లభించడం తెలిసిందే. ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) వైస్ చైర్మన్‌గా ఆయనను ఏపీలోని కూటమి...
ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి లభించడం తెలిసిందే. ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) వైస్ చైర్మన్‌గా ఆయనను ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ నేపథ్యంలో మెహర్ రమేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ భేటీ అనంతరం మెహర్ రమేశ్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పేరును ప్రతిపాదించి, మద్దతు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాడ్‌ఫాదర్' అంటూ మెహర్ రమేశ్ అభివర్ణించారు.రాష్ట్రంలో చలనచిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి ఈ కార్పొరేషన్ (APSFTVTDC) పనిచేస్తుంది. ఈ కీలక బాధ్యతను తనకు అప్పగించడం పట్ల మెహర్ రమేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు.