
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Bigg Boss 10 Telugu Contestants Leak: ప్రేక్షకులను విశేషంగా అలరించేందుకు బిగ్‌బాస్ త్వరలో మరో కొత్త సీజన్‌తో ముందుకు రానుంది. బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 10వ సీజన్‌కు సంబంధించి ఎవరెవరు పోటీదారులుగా ఉంటారని చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వస్తున్న ఊహాగానాలు.. చర్చ జరుగుతున్నాయి. ఈసారి సామాన్యులతోపాటు ప్రముఖులు పోటీదారులుగా ఉండనున్నారు. అయితే ఎవరు ఈ పోటీలో ఉంటారో ఒక జాబితా వచ్చేసింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్లో ఇప్పటివరకు 9 సీజన్లు దిగ్విజయంగా ప్రారంభమయ్యాయి. ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే తెలుగులో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు మరోసారి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమోని ఇటీవల విడుదల చేశారు. ఈ సీజన్లో కూడా సామాన్యులకు అవకాశం కల్పిస్తూ అగ్నిపరీక్ష నిర్వహించనున్నారు. గత సీజన్ల కంటే ఈసారి భిన్నంగా 10 సీజన్‌ని నిర్వాహకులు ప్రణాళిక వేశారు. దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్స్‌ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కంటెస్టెంట్లలో దాదాపు సగం మంది అంటే 10 మంది వరకు కామనర్సే ఉండే అవకాశం ఉంది. గత సీజన్లో సామాన్యులకు ప్రాధాన్యం ఇవ్వగా ఈసారి అదే స్థాయిలో అవకాశం ఇచ్చేటట్టు కనిపిస్తోంది. గత సీజన్ విజేత కల్యాణ్ పడాల సామాన్యుల కోటా నుంచే విజయం సాధించిన విషయ తెలిసిందే. దీంతో ఈ సీజన్లో ఎక్కువ మంది సామాన్యులను తీసుకునేలా పరిస్థితులు ఉన్నాయి. సామాన్యులను ఎంపిక చేయడానికి అగ్నిపరీక్ష నిర్వహించనుండగా.. అగ్నిపరీక్ష-2 కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు పరిశీలించి వారిలో కొంతమందిని ఎంచుకుని అగ్ని పరీక్షకు ఎంపిక చేయనున్నారు. జూలై 25వ తేదీ నుంచి అగ్ని పరీక్ష-2ని ప్రసారమయ్యే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష పూర్తయిన అనంతరం సెప్టెంబర్ తొలి వారంలో బిగ్‌బాస్ 10వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
బిగ్‌బాస్ 10వ సీజన్‌కు సెలబ్రిటీల జాబితాలో ఎవరెవరు ఎంపికవుతారనేది ఉత్కంఠ నెలకొంది. బుల్లితెరతోపాటు వెండితెర, సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందుతున్న వారిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. నిర్వాహకులు కంటెస్టెంట్లను ఎంపిక చేసి వారితో ప్రమోషన్లు, వారి ప్రొమో షూట్లు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సెలబ్రెటీల కోటాల ఎంపికయ్యే వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. బుల్లితెర నుంచి పల్లవి గౌడ, జబర్దస్త్ నటీనటులు రాకింగ్ రాకేశ్, పవిత్ర, నూకరాజు, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కల్యాణ్, సీనియర్ కేటగిరి జాబితాలో సీరియల్ నటుడు ప్రభాకర్ లేదా ఆయన కొడుకు చంద్రహాసన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా కేటగిరి నుంచి ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, రచయిత కడలి సత్యనారాయణ ఉన్నారని చర్చ జరుగుతోంది.
మంగ్లీ కూడా? ఇటీవల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ పేరు కూడా బిగ్‌బాస్ జాబితాలో వినిపిస్తోంది. ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ, డబ్బుల వసూళ్లు వంటి కేసులు ఆమెను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆ వివాదాల నేపథ్యంలో మంగ్లీ వస్తే సీజన్‌కు కావాల్సిన స్టఫ్.. హైప్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆమెకు ఎప్పటి నుంచో అవకాశాలు వస్తున్నా కూడా మంగ్లీ తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్‌కు కూడా రాకపోవచ్చని.. ఆమె ప్రస్తుతం ఉన్న స్థితిలో బిగ్‌బాస్ చాలా చిన్నదిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.