
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Andhra Pradesh Rains: ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. ప్రధానంగా విజయవాడ, విశాఖ నగరాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇక విశాఖ పట్నంలో రెండు గంటలకుపైగా ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షం వల్ల విశాఖకు రావాల్సిన 3 విమానాలు దారి మళ్లించారు అధికారులు. అంతేకాదు రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి సమయం కావడంతో షాపింగ్ కోసం బయటకు వచ్చిన వారు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల కింద నిలుచోరాదని పేర్కొంది.
మరోవైపు విజయవాడలోనూ వర్షం దంచికొట్టింది. విజయవాడలో ప్రధాన రహదారిలో మోకాలి లోతులో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ రోజు కూడా కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు రీ ఛార్జ్ అయ్యాయి. అటు రాయలసీమలో మాత్రం వర్షపు జాడ లేకుండా పోయింది. కేవలం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది.
రాయలసీమలో వర్షాలు.. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో నేడు అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బాపట్ల, నెల్లూరులో ఓ మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిస్తుందని సమాచారం. అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.