
కోల్కతా: యోగా (International Yoga Day).. ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.
‘వయసుతోపాటు ఆరోగ్యానికి యోగా’ ఇతివృత్తంతో కోల్కతాలోని రెడ్ రోడ్లో 35 వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాతో ప్రపంచ వ్యాప్తంగా ఒకరికొకరు కలిసినట్లయిందన్నారు. కోల్కతాలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు.
‘‘జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయింది. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. కేవలం కొన్ని వయసుల వారికే పరిమితం కాలేదు. ఇది మానవ స్ఫూర్తికి నిదర్శనం. ప్రపంచ వ్యాప్తంగా ఒకరికొకరిని చేరువ చేస్తుంది. అందర్నీ ఏకం చేస్తుంది. జీవనం మరింత సమతులంగా సాగేలా చేస్తుంది. ఏం చేయాలో, ఏం చేయకూడదో నేర్పుతుంది. శక్తిమంతంగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
20ఏళ్ల కంటే 40 ఏళ్ల వయసులో మరింత దృఢంగా ఉండాలి. ఒత్తిడి రహిత జీవితానికి యోగా దోహదం చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తం. అందుకే యోగాను కొన్ని సందర్భాలకే పరిమితం చేయకుండా.. నిత్యం సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరింత మెరుగైన ప్రపంచం కోసం యోగా అవసరం’’ అని మోదీ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.