
యోగా.. ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది అందర్నీ కలుపుకొని పోతోందన్నారు.
‘వయసుతోపాటు ఆరోగ్యానికి యోగా’ ఇతివృత్తంతో కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ‘‘యోగాతో ప్రపంచ వ్యాప్తంగా ఒకరికొకరు కలిసినట్లయింది. యోగా ఐక్యతకు మూలంగా నిలుస్తుంది’’ అని అన్నారు. నగరంలో వివిధ చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. యోగా.. ఐక్యతకు మూలం: మోదీ |