
పంట, కలప, ఇతర ఘన వ్యర్థాల్ని తగలబెట్టినప్పుడు తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుంది. అలా కాకుండా వీటిని బయోచార్ ప్రొడక్ట్ యంత్రంలో ఆక్సిజన్ రహితంగా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే బయోచార్ (ప్రత్యేక...
పంట, కలప, ఇతర ఘన వ్యర్థాల్ని తగలబెట్టినప్పుడు తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుంది. అలా కాకుండా వీటిని బయోచార్ ప్రొడక్ట్ యంత్రంలో ఆక్సిజన్ రహితంగా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే బయోచార్ (ప్రత్యేక బొగ్గు) తయారవుతుంది. ఈ ప్రక్రియలో కాలుష్యం కూడా వెలువడదు. ఆ బయోచార్.. మట్టిలో కార్బన్ శాతాన్ని పెంచడమే కాక భూమి నీటి నిల్వ సామర్థ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి వాడితే మట్టిలోని సూక్ష్మజీవుల వృద్ధికి సహాయపడి పంట దిగుబడి పెరుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన బెస్ట్ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ దీన్ని రూపొందించిందని ఆ సంస్థ ప్రతినిధి పవన్‌కుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా లింగంగుంట్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు.
ఈనాడు, అమరావతి; న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.