
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో క్రమేపీ బలపడుతోంది. పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
విశాఖపట్నం, అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో క్రమేపీ బలపడుతోంది. పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. భారత ఉపఖండంపై ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఆగ్నేయాసియా, దక్షిణాసియాపై ఎక్కువగా ప్రభావం పడనుందని, ముఖ్యంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాలను ఎల్నినో తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఏషియన్ పసిఫిక్ క్లైమేట్ సెంటర్(ఏపీసీసీ) ఆందోళన వ్యక్తంచేసింది.
ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి తేలికపాటి నుంచి భారీవర్షం కురిసింది. విశాఖ నగరంలో రహదారులు జలమయమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షం.. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. సోమవారం కూడా రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది.