
Deputy Director Narahari : తెలంగాణలో ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి అక్రమాస్తుల కేసులో రోజుకో నమ్మలేని నిజం వెలుగుచూస్తోంది. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారు
లు తాజాగా ఆయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను తెరిచి చూడటంతో మరోసారి భారీగా అక్రమ సంపద బయటపడింది. లాకర్ల తాళాలు ఇచ్చేందుకు నరహరి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో, ఏసీబీ అధికారులు బ్యాంకు అధికారుల సమక్షంలో వాటిని బద్దలు కొట్టారు. ఈ సోదాల్లో కేవలం లాకర్ల నుంచే రూ.1.5 కోట్ల నగదు (నోట్ల కట్టలు), సుమారు 2.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సామాన్య ప్రభుత్వ ఉద్యోగి అయిన నరహరి, తన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇంత పెద్ద మొత్తంలో సంపదను ఎలా కూడబెట్టారనే కోణంలో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి
డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల జరిగిన ప్రాథమిక సోదాల్లోనే ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.5 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు), బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న రూ.2.29 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. అంతేకాకుండా, గత సోదాల్లోనే 1.3 కిలోల బంగారం, ఏకంగా 8 కేజీల వెండి వస్తువులను కూడా సీజ్ చేశారు. తాజా లాకర్ల రికవరీతో కలిపి నరహరి అక్రమాస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం పదుల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అవినీతి తిమింగలం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Telangana Rain Alert: రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Bhadradri Kothagudem: 2023లో మృతి.. 2024లో వివాహం.. కల్యాణ లక్ష్మి కోసం నకిలీ పెళ్లి పత్రాలు
Sudarshan Reddy: కొత్త ఓటరు నమోదుపై తప్పుడు ప్రచారాలకు చెక్..‘సర్’ ప్రక్రియపై సుదర్శన్ రెడ్డి
Keesara Mother Kills Son: ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి
Mahabubnagar News:అన్నదాతలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు
Kavitha Singareni protest: కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో స్పందించాలి.. కవిత హెచ్చరిక