
వాషింగ్టన్: అమెరికాలో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతోపాటు సేవా కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తున్న ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA)’ ద్వితీయ మహాసభలు కనులపండువగా జరుగుతున్నాయి.
పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రముఖ నటి జయప్రద, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హాలీవుడ్ నటుడు, రచయిత విషీ అయ్యర్, నటుడు సుమన్, హాస్యనటుడు అలీ, జబర్దస్త్ కామెడీ బృందం, ప్రముఖ మిమిక్రీ కళాకారులు పాల్గొని సందడి చేశారు. భారత్, అమెరికాకు చెందిన ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు తదితరులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.