
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు...
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు
హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): నీట్ (NEET) పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్య విద్యలో ప్రవేశానికి ముఖ్యమైన ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతోకాలంగా కృషి చేశారని పేర్కొన్నారు. తమ శ్రమ, పట్టుదలపై నమ్మకం ఉంచి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు సంబంధించి తెలంగాణలో సుమారు 208 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా నిబంధనలను పాటిస్తూ ప్రశాంతమైన మనసుతో పరీక్ష రాయాలని తెలిపారు. విద్యార్థులందరూ తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
వీకెండ్లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News