దగ్గు కలిగించే అసౌకర్యాన్ని తగ్గంచుకోవడానికి తేనె, అల్లం, తులసి ఆధారిత దగ్గు సిరప్లు దగ్గును తగ్గించడంలో సహాయపడతాయట.
సాధారణ దగ్గు నివారణలతో పోలిస్తే ఈ సహజ నివారణలు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతోనే లభిస్తాయి.
యూరోపియర్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం తేనె ఆధారిత సిరప్‌లలో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయట. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయట.
EJIM అధ్యయనం ప్రకారం అల్లంలో గొంతుకు హాయిని కలిగించే గుణాలు ఉండటం వల్ల ఇది గొంతు నొప్పి నివారణకు ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో ఉండే జింజెరాల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు గొంతునొప్పి లేదా దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కోరుకునే వారికి దీనిని ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారుస్తాయి. సిరప్ రూపంలో సేకరించిన అల్లంలోని గుణాలు కఫాన్ని కరిగించడానికి, గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
ఐజేబీసీఎఫ్ అధ్యయనం ప్రకారం దగ్గును తగ్గించడంలో తేనె ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టమవుతోంది. తేనెను అల్లంతో కలిపి తీసుకున్నప్పుడు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారిలో సాధారణంగా కనిపించే గొంతు అసౌకర్యాన్ని మంటను ఇది సులభంగా తగ్గిస్తుంది. తేనె నేచురల్ దగ్గు నివారణిగా అద్భుతంగా పనిచేస్తుందట.
EBCAM అధ్యయనం ప్రకారం తులసి ఆధారిత దగ్గు సిరప్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని ఇవి శ్వాసకోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నొక్కి చెప్పింది. అయితే ఒకవేళ తులసి గొంతులో మరింత పొడిబారే గుణాన్ని ప్రేరేపిస్తే దాని వల్ల గొంతు పొడిబారే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో తులసి అద్భుతంగా పనిచేస్తుందట.
ఇవి సాధారణ దగ్గు, కాలానుగుణంగా వచ్చే జలుబుకు మాత్రమే ఉపయోగపడతాయి. అన్నీ రకాల వ్యాధులకు సంపూర్ణ వ్యాధులకు సంపూర్ణ నివారణ కాదు. ఎందుకంటే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం వైద్య నిపుణుల సలహా ఎంతో అవసరం.
తీవ్రమైన దగ్గు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బ్యాక్టీరియా సంబంధిత అనారోగ్యం ఉన్నప్పుడు, వారం రోజులకుపైగా తగ్గకుండా దీర్ఘకాలిక దగ్గు ఉన్నప్పుడు సహజ నివారణలు ఉపశమనం కలిగించలేదు. ఈ సమయంలో తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి