మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి జ్యేష్ఠ పూర్ణమి వేళ ఎరుపు రంగు దుస్తులు, బియ్యం, పాయసం పప్పు, శనగలు తదితర వాటిని దానం చేయాలి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడంతో పాటు ఏడాది పొడవునా మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పెరుగు, నెయ్యి పంచదార, వెన్న దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది.
మిథున రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున గోమాతకు పచ్చి గడ్డి దానం చేయాలి. గోశాలకు మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వాలి. దీంతో పాటు పాలు లేదా బియ్యం చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు నష్టాలు తగ్గిపోయి లాభాలు రావడం ప్రారంభమవుతుంది.
కర్కాటక రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పాలు, పెరుగు, అన్నం, పంచదార తదితర వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, కుభేరుని ఆశీస్సులు లభిస్తాయి.
సింహ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి గోధుమలు, బెల్లం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహ స్థానాలు బలపడతాయి.
కన్య రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ సీజనల్ పండ్లు, కూరగాయలు దానం చేయాలి. దీంతో పాటు బియ్యం కూడా దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభించనున్నాయి.
తులా రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. దీంతో పాటు పాలు, బియ్యం, నెయ్యి దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందొచ్చు.
వృశ్చిక రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి ఎరుపు రంగు దుస్తులను, పాదచారులకు ఏదైనా పండ్ల రసాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
ధనస్సు రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున పేదలకు కుంకుమ కలిపిన పాలను పంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.
మకర రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ గొడుగు, తోలు చెప్పులు, పాదరక్షలు దానం చేయాలి. అలాగే ప్రవహించే నీటిలో బియ్యం వేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.
కుంభ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పేదలకు అన్నదానం చేయాలి. దీంతో పాటు నల్ల నువ్వులు, నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
మీన రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే బ్రాహ్మాణులకు దానం చేయాలి. దీంతో పాటు పసుపు వస్తువులు, పుస్తకాలు, తేనే తదితర వాటిని దానం చేయాలి. దీని వల్ల మీ జీవితంలో మంచి ప్రయోజనాలు చేకూరతాయి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి