
Janasena vs Congress : తెలంగాణ రాజకీయాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది.
హైదరాబాద్‌లో జనసేన పార్టీ సరికొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీ దీనిపై తీవ్రంగా స్పందించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వచ్చినా, లేదా బీజేపీతో కూడిన ‘కమల కళ్యాణ్’ వచ్చినా తమకు వచ్చే నష్టమేమీ లేదని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం స్థిరంగా సాగుతోందని, ఇలాంటి సమయంలో పొరుగు రాష్ట్ర నేతలు ఇక్కడికి వచ్చి అనవసరంగా రాజకీయాలు చేస్తామంటే తెలంగాణ సమాజం అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు.
Read Also : విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న – రేవంత్
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన, ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో పోటీ చేసేందుకు క్షేత్రస్థాయిని సిద్ధం చేసుకుంటోంది. అయితే, ఈ ప్రాంతీయ సెంటిమెంట్‌ను మరియు కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఇక్కడికి వస్తున్నారంటూ జనసేనపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్సెస్ జనసేన-బీజేపీ కూటమి మధ్య రాజకీయ పోరు మరింత ఊపందుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Bullet Trains : తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్స్.. ఇది గొప్ప వరం – కిషన్ రెడ్డి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Tunnel Roads : హైదరాబాద్ లో టన్నెల్ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
CP Sajjanar: స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ
Chaganti Koteswara Rao Siddipet Pravachanam:చాగంటి కోటేశ్వరరావు గారి ‘గో మాత వైభవం’ ప్రవచనం!
Department of Education : విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న – రేవంత్
Telangana Voter List Verification: జూన్ 25 నుంచి తెలంగాణలో ఇంటింటి ఓటర్ సర్వే