
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
మూవీ రివ్యూ: దీవానా (Deewana) నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహా మనిమేఘలై, నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు తదితరులు మ్యూజిక్ : ఈశ్వర్ చంద్ ఎడిటింగ్: హృషికేశ్ పస్పల్ డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: పచ్చిపులుసు వంశీ ప్రొడ్యూసర్స్: అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి డైరెక్టర్: శ్రీకాంత్ సంఘిశెట్టి
‘దీవానా’ ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై యూత్ ప్రేక్షకుల్లో ఓ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేఘలై హీరో, హీరోయిన్స్‌గా నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
మున్నా (హర్షిత్ రెడ్డి) ఎలాంటి లక్ష్యం లేకుండా తిరిగే హైదరాబాదీ యువకుడు. డిగ్రీ పూర్తైయిన ఎలాంటి జాబ్ చేయకండా తన ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేస్తుంటాడు. ఇతని నాన్న శేఖర్ (నరేష్) అతన్ని కష్టపడి చదవిస్తాడు. కానీ మున్నా మాత్రం ఎలాంటి బాధ్యతలు లేకుండా బిహేవ్ చేస్తుంటాడు. అయితే అనుకోకుండా ఓ మీ సేవా సెంటర్లో పనిచేససే అమూల్య (స్నేహ మణిమేఘలై)ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను పటాయించడానికి పనిలేకున్నా.. రోజు మీ సేవా సెంటర్ కు వెళుతుంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం తాను నెలకు రూ. 20 వేలకు సంపాదిస్తున్నాను. కనీసం రూ.20 వేలు కూడా సంపాదించలేని నువ్వు ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోని చూపించు అని అతన్ని నిలదీస్తుంది. అమూల్య మాటలను మనసు మీదికి తీసుకున్నా.. మున్నా.. తన లక్ష్యం సాధించాడా ? తన ప్రేమకు గెలుచుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
ఇంట్లో బరువు బాధ్యత లేని ఓ జులయి కుర్రాడు.. ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెను అతని స్థాయిని ప్రశ్నించడంతో అతను దాన్ని సీరియస్‌గా తీసుకొన్న అందరు అయోగ్యుడు అనుకున్న యువకుడు .. ఎలా యోగ్యుడుగా మారాడన్న స్టోరీ పాయింట్ చుట్టూ కథను అల్లుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి. తెలుగు సహా అన్ని భాషల్లో ఇలాంటి ఫార్మాట్ కథలు ఎన్నో తెరకెక్కాయి. కానీ ఈ దర్శకుడు ఈ సినిమాలో ఇచ్చిన ట్విస్ట్ ఇప్పటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాప్లో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం.. హీరోయిన్‌తో ప్రేమ.. ఆ తర్వాత ఆమె హీరోను ఛాలెంజ్ చేయడం.. ఆ తర్వాత సెకండాఫ్ ఎమోషనల్ టర్న్ తీసుకోవడం వంటి సీన్స్‌ను బాగానే రాసుకున్నాడు. సెకండాఫ్‌లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.
ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఓ కొడుకు గురించి తండ్ర పడే ఆవేదన వంటి సీన్స్ గుండెలను బరువెక్కిస్తాయి. ప్రీ క్లైమాక్స్ సీన్.క్లైమాక్స్ బాగున్నాయి. హీరో చివర్లో తను అనుకున్నది సాధించడం వంటివి లాజిక్‌కి అంత ఈజీగా అందవు. సినిమా కాబట్టి సర్దుకోవాల్సిందే. ఇక పతాక సన్నివేశాలు ప్రేక్షకుల ఊహాలకు తగ్గట్టే ఉంది.
సాంకేతికంగా ఈ సినిమాకు బాగుంది. విజువల్స్ చాలా సహజంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.పాటలు వినసొంపుగా ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ కూడా దర్శకుడిగా మంచి ప్రయత్నం చేశాడు.
హర్షిత్ రెడ్డి తండ్రి సంపాదించే సంపాదనను ఎంజాయ్ చేసే జులాయి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్.. ఆ తర్వాత క్లైమాక్స్‌లో అతని నటనలో పరిణితి కనిపిస్తుంది. అమూల్య పాత్రలో స్మేహా మణిమేఘలై గ్లామర్ కమ్ యాక్టింగ్‌తో మెప్పించింది. నరేష్ మరోసారి తన నటన జీవితాన్ని రంగరించి నటించాడు. ఈ సినిమాకు ఆయన నటన అదనపు బలం చేకూరింది. తల్లి క్యారెక్టర్లో ఝాన్సీ మరోసారి మెప్పించింది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్: యూత్‌కు కనెక్ట్ అయ్యే.. దీనావా...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.