
దేశం ‘వన్ పార్టీ.. నో ఎలక్షన్స్’ అనే దిశగా పయనిస్తోందని.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీలకు ఓటు వేసిన ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తమకు కాంగ్రెస్తో తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నా.. భాజపా మాదిరిగా శివసేన(యూబీటీ)ని నాశనం చేయడానికి ఆ పార్టీ ఎప్పుడూ ప్రయత్నించలేదని పేర్కొన్నారు. 30 ఏళ్ల పొత్తు తర్వాత కూడా తాము భాజపాలో విలీనం కాలేదని.. కాంగ్రెస్లో ఎందుకు విలీనమవుతామని ప్రశ్నించారు. 👉మరిన్ని వివరాలు విభేదాలున్నా కాంగ్రెస్ అలా చేయలేదు: ఉద్ధవ్ |